fbpx

నాడు… తండ్రిని చూసి కుమారుడిని గెలిపించారు…..నేడు మీ బిడ్డల భవిష్యత్తు కోసం టిడిపి జనసేన లను గెలిపించండి : నాగబాబు

Share the content

రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో తండ్రిని చూసి కుమారుడిని గెలిపించారు. ప్రస్తుతం మీ బిడ్డల భవిష్యత్తు కోసం జనసేన,టిడిపిలను గెలిపించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు కోరారు. వైసిపి ప్రభుత్వ హయాంలో యువత ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పెందుర్తి నియోజకవర్గ నాయకులు,జన సైనికులు ,వీర మహిళలు తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….2020 లో కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తే..2019 లోనే ఆంధ్ర రాష్ట్రం కు వైసిపి వైరస్ పట్టి అభివృద్ధిని సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు..రాబోయే ఎన్నికల్లో జనసేన టీడిపి పార్టీల గెలుపే ఆ వైరస్ కు మందు అని స్పష్టం చేశారు.

పెందుర్తి నియోజకవర్గంలో దశాబ్దాలుగా పంచగ్రామాల భూ సమస్య వేధిస్తుంది.పరవాడ కాలుష్యం ప్రజలను పట్టి పీడిస్తుందని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇప్పటివరకు తగిన న్యాయం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంద్ర లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు,విశాఖ నగరానికి తాగునీటి , పారిశ్రామిక అవసరాల ను తీర్చే సుజల స్రవంతి పనులు నత్తనడక న సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాబోయే జనసేన టిడిపి ప్రభుత్వం అధికారం లోకి రాగానే యుధ్ధ ప్రాతిపదికన ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఇచ్చారు.వలసలను నిరోధించి స్థానికంగా నే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి సరికొత్త మార్పును తీసుకువస్తామని తెలిపారు.

దోపిడీ ప్రభుత్వాన్ని ఎంత కాలం భరించాలి ?

కరోనా సమయంలో మాస్క్ లు లేవని ప్రశ్నించినందుకు దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను వేధించారు.ఆ వేదనతోనే ఆయన మృతి చెందారని వాపోయారు..వైసిపి నాయకులు అహంకారం తలకెక్కి ఎంత మాట అంత మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసిపి నేతలు విశాఖ, చుట్టూ పక్కల కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రవేట్ అనే తేడా లేకుండా కబ్జాలకు పాల్ప డుతున్నారు.చివరకి సామాన్యుడిని కూడా వదలకుండా దోచుకుంటున్నారు.ఇలాంటి దోపిడీ ప్రభుత్వాన్ని ఎంత కాలం భరించాలి అని ప్రశ్నించారు.

వైరస్ ను అంతం చేయటానికి కలిసి పని చేద్దాం
రాష్ట్రంలో ఆడబిడ్డ మిధ అత్యాచారం జరిగితే తల్లి పెంపకం సరిగా లేదని దారుణంగా ఒక మంత్రి బహిరంగంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ చదువుకోవటం వలనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువయింది అని మరో మంత్రి అంటున్నారు.రోడ్లు కావాలా ? సంక్షేమ పథకాలు కావాలా అని మరో ఇంకో మంత్రి డిమాండ్ చేస్తారు.ఇలాంటి వాళ్ళను మళ్ళీ ఎన్నుకుంటే రాష్ట్రం వైరస్ కు రాష్ట్రం బలి కాక తప్పదు అని పేర్కొన్నారు.ప్రతి ఒక్క టిడిపి,జనసేన కార్యకర్తలు వైరస్ ను అంతం చేయటానికి కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు,ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపూ వెంకట్ సతీష్,పార్టీ అధికార ప్రతినిధి సుంద్రలు విజయ్ కుమార్ ,నియోజక వర్గ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *