fbpx

ప్రభుత్వ సలహాదారులకు రూ. 680 కోట్లా ? : నాదెండ్ల మనోహర్

Share the content

రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత మంది సలహాదారులను నియమించిందో జాబితా విడుదల చేయాలని జనసేన పార్టీ పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో సలహాదారులు ఏ శాఖ కోసం.. ఏ పని కోసం నియమించారు..వారు ఎటువంటి సలహాలు ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇచ్చిన సలహాలను ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా? ఇచ్చిన సలహాలు పాలసీలు గా మారాయా? సలహాదారుల వలన రాష్ట్రానికి,ప్రజలకు జరిగిన మేలు ఏమిటో ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. మంత్రులను, ఉద్యోగులను ఉపయోగించుకోకుండా 90 మంది సలహాదారులును నియమించి రాష్ట్ర ఖజానా నుంచి 680 కోట్లను వెచ్చించారు అని మండిపడ్డారు. దీనిపై సమగ్రమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు పేర్లు సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు.

ప్రత్యేకంగా ఒక్క సజ్జల రామకృష్ణ రెడ్డి కు రూ. 140 కోట్లను వెచ్చించారు అని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయ్ లు జమ చేసుకున్న బెన్ ఫీట్ లను తిరిగి ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సలహాదారుల నియామకం గురుంచి జనసేన హై కోర్ట్ లో పిల్ వేసినప్పుడు… హైకోర్ట్ …సలహాదారుల గురుంచి తీవ్ర వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. సలహాదారులు నియామకం చూస్తుంటే ప్రతి జిల్లాలో కలెక్టర్ల కు కూడా సలహాదారులను నియమించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని హైకోర్ట్ మండిపడిందని గుర్తు చేశారు.సలహాదారుల వ్యవస్థను అన్ వారెంట్ అండ్ అన్ నేస్ససరి అని హై కోర్టు వ్యాఖ్యానించింది అని గుర్తు చేశారు.సలహాదారులు కూడా ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ముగ్గురు సలహాదారులు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చక, వ్యవస్థల మీద విసుగు చెంది రాజీనామా చేశారు అని వెల్లడించారు. రాబోయే జనసేన టిడిపి ప్రభుత్వంలో సలహాదారుల నియామకాల మీద విచారణ జరిపిస్తామని తెలిపారు.

  • మధ్యంతర బడ్జెట్ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచి
  • పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం, పేదలకు ఇల్లు నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పడం హర్షించదగిన పరిణామమని పేర్కొన్నారు.రైతులు, యువత, మహిళలకు స్వాంతన చేకూర్చే కొన్ని పథకాలను ప్రవేశ పెట్టడం స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేలా 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందించే పథకం అభినందనీయం అని తెలిపారు.యువతను ప్రోత్సహించడానికి టెక్నాలజీ విషయంలో వారికి భరోసా కల్పించే విధంగా లక్ష కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ప్రకటించారో స్వాగతిస్తున్నామని అని పేర్కొన్నారు.మధ్య తరగతి కి ఉపయోగపడే విధంగా హౌసింగ్ ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద రెండు కోట్లు అదనంగా గృహ నిర్మాణాల కోసం రాబోయే రోజుల్లో మంచి అవకాశంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *