fbpx

ఐదేళ్ల పరిపాలనలో చేతులారా చేసుకున్నావు జగనన్న : వైయస్ షర్మిల

Share the content

కాంగ్రెస్ పార్టీకి వైయస్ కుటుంబాన్ని చీల్చవల్సిన అవసరం ఏముంది. రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ కి రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటకీ ఎప్పటికీ అభిమానమే. కాంగ్రెస్ లో కొంతమంది నాయకుల వలన రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన మీద విష ప్రచారం జరిగిందని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిళ తెలిపారు. గురువారం కాకినాడ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలికకు కారణం జగనన్నే. దీనికి సాక్ష్యం తన తల్లి, తన కుటుంబం,ఆ దేవుడు అని పేర్కొన్నారు.గతంలో వైసిపి పార్టీ ఆవిర్భావంలో కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, జగనన్న పక్కన నిలబడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. వారినీ మంత్రులను చేస్తాను అని చెప్పారు.పార్టీ బలోపేతం కొరకు అమ్మ, నేను తిరిగాము…వారి గెలుపుకు పాటు పడ్డాం..ఆ తరువాత వైసిపి పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని ..తనను పాదయాత్ర చేయమని అడిగితే బిడ్డలని సైతం కాధునుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని పేర్కొన్నారు.

తెలంగాణ లో ఓదార్పు యాత్ర కు వెళ్ళాను…పార్టీకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడ్డాను అని పేర్కొన్నారు..పార్టీ కోసం మీరు ఇది చేయాలని అడిగితే… మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా నిస్వార్థంగా మికోసంని ఎది అడిగితే అది చేశాను… మీ గెలుపు కోసం ఉరు ఊరు తిరిగాను…ముఖ్యమంత్రిని అయ్యిన తరువాత నుంచే మనిషే మారిపోయాడు…అయిన సరే …నాకు వ్యక్తిగతంగా న్యాయం చేయకపోయినా పరవాలేదు అని బావించా…..రాజశేఖర్ రెడ్డి పేరును,ఆశయాలను నిలబెడితే చాలని ఆశించా…దాదాపు ఐదేళ్ల పరిపాలన చూసా….జగన్మోహన్ రెడ్డి ,ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు,ఎంపిలు అందరూ బిజెపి పార్టీ కి బానిసలుగా మారారు.రాష్ట్రంలో బీజీపీ ఒక్క ఎమ్మెల్యే,ఎంపి గెలవలేదు..అయినా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాజ్యమేలుతుంది అని అవేధన వ్యక్తం చేశారు..జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బిజెపి కి బానిసలుగా చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు స్పెషల్ స్టేటస్ అని చట్టంలో పెడితే ….బీజీపీ వారు తాము అధికారంలోకి వస్తే పది ఏళ్లు ఇస్తామని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ 15 ఏళ్లు కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చి బిజెపి ప్రభుత్వం లో మంత్రులు కూడా అయ్యారు…స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు మాట్లాడింది లేదు కానీ… మాట్లాడిన వారి మీద కేసులు పెట్టారని పేర్కొన్నారు.మూకుమ్మడిగా రాజీనామా లు చేద్దాం….స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో అని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగనన్న అడిగారు..అధికారంలోకి వచ్చాకా ఒక్క సారైనా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమం చేసింది లేదు..అంతలా బిజెపి కి బానిసలు ఐపోయారు. అంతగా బిజెపి పార్టీ రాష్ట్రాన్ని వసం చేసుకుందని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబడతారు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు.రాష్ట్రంలో రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది.రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా?
రాజశేఖర్ రెడ్డి పనితీరు కూడా మి పని తీరులో కనిపిస్తే ఆపుడు మీరు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారు అని వెల్లడించారు.

రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్ట్ పోలవరం..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞం లో బాగంగా పోలవరం కు ఏడాదిలోనే శంఖుస్థాపన చేశారు. మొత్తం 20 లక్షల ఎకరాలు కు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు.10,000 కోట్లు అంచనాలతో 198 టిఎంసిల సామర్థ్యంతో ఆనాడు రాజశేఖర్ రెడ్డి సాహసం చేసి పోలవరం ను మొదలు పెట్టారు..ఆ ప్రభుత్వంలో 4500 కోట్లతో పనులు కూడా చేశారు. ఆ తరువాత వచ్చిన టిడిపి కానీ,వైసిపి కానీ ప్రాజెక్ట్ పనులను ముందుకు కదిలించలేదు…విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్టు..90 శాతం నిధులును కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చట్టం ఉంది.కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం సాయం చేస్తుంది అంటే…మీరు ప్రాజెక్ట్ కట్టకండి ..మేమే కట్టుముంటాము అని పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయలను అని చెప్పి 2018 కల్లా పోలవరం ను పూర్తి చేస్తాను అని చెప్పినప్పటికీ కట్టడం సాధ్యం కాలేదన్నారు.జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం అంచనా వ్యయం 55,000 కోట్ల గా ప్రకటించారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి 90 టిఎంసిలకు సామర్థ్యం కు కుదించారు.పోలవరం పై కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నాం ..ఉన్నాం… అని సాగ తిసారే తప్పా… ఇంతవరకు పూర్తి చేయలేదాని మండిపడ్డారు.దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *