fbpx

ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు ఐతే .. ఐప్యాక్ ను రద్దు చేయండి : వి శ్రీనివాసరావు

Share the content

తనకు స్టార్ క్యాంపెయనర్లు గా ప్రజలే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మితే కార్పొరేట్ సంస్థ అయిన ఐప్యాక్ ను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.బుధవారం విజయవాడ లోని భాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ను నడపటం,వాలంటీర్ లకు సూచన చేయడం,ఎమ్మెల్యేలను బదిలీ చేయడం మొత్తం ఐ ప్యాక్ నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలలు ముందుగా అధికార పార్టీనే ఓటర్లు జాబితా తయారు చేస్తుందని విమర్శించారు. ఎన్నికలు స్వేచ్చగా ప్రజాస్వామ్యయుతంగా జరగటానికి ఎన్నికల యంత్రాంగాన్ని.. ఎన్నికల కమిషన్ చేతిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆసరా పథకం లో కోటి మంది ఉంటే 79 లక్షల మందికి ఇచ్చారని విమర్శించారు. డ్వాక్రా గ్రూప్ ల డిపాజిట్లు బ్యాంక్ లో రూ.18,000 కోట్లు ఉన్నాయన్నారు. వాటికి రూపాయి వడ్డీ ఇచ్చినా 3,000 కోట్లు వడ్డీ వస్తుందని వెల్లడించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కేవలం 1300 కోట్లు మాత్రమే నని వెల్లడించారు. డ్వాక్రా గ్రూపులు వారు ప్రభుత్వానికి, బ్యాంక్ లుకు నగదు ఇస్తున్నారా? ప్రభుత్వమే డ్వాక్రా గ్రూపు లకు నగదు ఇస్తుందా అని ప్రశ్నించారు. ఆసరా ద్వారా మహిళలను కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తిగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోన్ ప్రాసెస్ పేరుతో వందల కోట్ల రూపాయలు బ్యాంక్ లు ,ప్రభుత్వము వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటా రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి బయంతో మూడేళ్ళ క్రితం రాజీనామా చేసిన గంట శ్రీనివాస్ రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసినా స్పీకర్ రాజ్యంగపరంగా నడుచుకోవాలని తెలిపారు.

*కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసేందుకు మతం ఒక సాధనం
దేశంలో పెద్ద ఎత్తున మత ఘర్షణల ఉద్రిక్తతలును పెంచడానికి కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్ర బయట దేశస్థులు, ఉగ్రవాదులు చేస్తున్న కుట్ర కాదని..కేంద్ర ప్రభుత్వమే ప్రజల మధ్య వైషమ్యాలు పెంచటానికి కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేత .. మత ఎజెండ నెత్తిన పెట్టించి దేశ వ్యాప్తంగా దాన్ని ప్రధాన అంశంగా తయారు చేయటానికి మోదీ పథకం పన్నారని విమర్శించారు. ప్రజలు తమ సమస్యలను గురుంచి,దేశ ఐక్యత గురుంచి ఆలోచించకుండా… మతం, మత ఆవేశాలు గురుంచి ఏ దేవుడు గొప్పవాడు అనే చర్చలో మునిగిపోయారన్నారు. దాని మీద ఒకరిని ఒకరు నిందుకచుకోవటం, ఘర్షణలు మొదలు అయ్యి పరస్పర విద్వేషాలతో పక్క దేశాల కింద భారతదేశాన్ని బలహీనం చేసే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు.

భూస్వాములకు పెట్టుబడి దారులుకు ..ఆధాని, అంబానీ లాంటి వారికి పెద్ద పీట వేసేందుకు మతాన్ని ఒక సాధనంగా మోదీ మత అజెండాను తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలో ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కేంద్రం వంత పాడుతూ..ఆయన సేవల్లో మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ దృష్టిలో పడి తాను మద్దతు సంపాదించాలని ఒక ఆతృతలో చంద్రబాబు ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి రెండు ఇనుప కంచెను ఏర్పాటు చేసి అవతల వైపు చూస్తూ చంద్రబాబు కు అవమానించారని పేర్కొన్నారు. ఇలాంటి లొంగుబాటు తెలుగు ప్రజలకు అవమానకరం అని పేర్కొన్నారు. లౌకికతత్వం మీద నికరంగా నిలబడి బిజెపి మత ఘర్షణలను నివారించాలని రాష్ట్ర పార్టీలను డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *