fbpx

తుందుర్రు గొడవ ఏమైంది??

Share the content

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఒకప్పుడు తుందూరు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదం పెద్ద దుమారాన్ని రేపింది. ఆక్వా ఫుడ్ పార్కు వల్ల తమ బతుకులు కాలుష్యం అవుతున్నాయని, ఫుట్ పార్క్ నుంచి వచ్చే వ్యర్ధాలు నేరుగా తమ నీళ్లలో కలవడం వల్ల తాగునీరు కూడా కలుషితం అవుతోందని సుమారు 10 గ్రామాల ప్రజలు పెద్ద ఉద్యమమే లేవదీశారు. ఇది పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో పెద్ద ఉద్యమంగా మారింది. తర్వాత ఈ వ్యవహారంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, ఫుడ్ పార్క్ యాజమాన్యం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఉద్యమం పూర్తిగా నీరుగారిపోయింది. సుమారు 30 మంది పై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టడంతో పాటు, ఉద్యమకారుల్లోనే భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్యమం పూర్తిగా నిలిచిపోయినట్లు అయింది.

ఒక ఊపు ఊపిన ఉద్యమం

మెగా ఫుడ్ పార్కు ఉద్యమం ఒకప్పుడు ఒక ఊపు ఊపింది. తెలుగుదేశం పార్టీ హయాంలో మెగా ఫుడ్ పార్కు నిర్మాణం విషయంలో అనుమతులు ఇవ్వడం, ఫుడ్ పార్క్ యాజమాన్యం వ్యర్ధాలను వదిలిపెట్టే కనీస కాలువలు తవ్వకుండా నేరుగా పెద్ద జలాలను చెరువుల్లోకి వదలడంతో తుందుర్రితో సహా పక్కనున్న సుమారు నాలుగు ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర కాలుష్య బారిన పడ్డారు. తాగేందుకు నీరు లేక భూగర్భంలో నుంచి వచ్చే నీరు కూడా పూర్తిగా కలుషితం అయి రావడంతో మొత్తంగా 10 గ్రామాల ప్రజలు దీనిపై ఉద్యమం చేపట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వ్యవహారం వెళ్ళింది. అయితే తర్వాత దీనిలో కొందరు రాజకీయ నాయకులు ఉద్యమకారుల ముసుగులో ప్రవేశించడంతో మొత్తం ఉద్యమం నీరుగారిపోయింది. అన్ని పార్టీల తాలూకా కోవర్టులు ఉద్యమంలోకి ప్రవేశించడం, తర్వాత ఉద్యమకారుల పైకి ప్రభుత్వం అంతే దురుసుగా కేసులు పెట్టడం, ఉద్యమంలో కీలకంగా ఉన్న వారి మధ్య రకరకాల భేదాభిప్రాయాలు, రాజకీయ భిన్నాభిప్రాయాలు రావడం తో మెల్లమెల్లగా ఆక్వా ఫుడ్ పార్క్ పరిశ్రమ ఉద్యమం నీరుగారిపోయింది.

https://godavarionline.net/denduluru_present_politics/

నోరేత్తని వైసీపీ

అధికారంలోకి వచ్చిన వెంటనే తొందర మెగా ఫుడ్ పార్క్ సమస్యను కచ్చితంగా తీరుస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అయితే దాని తర్వాత ఈ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా తుందుర్రు మెగా ఫుడ్ పార్కు బాధితులతో నేరుగా మాట్లాడారు. అప్పట్లోనే ఈ ఉద్యమాన్ని జనసేన పార్టీ భుజాన వేసుకుంటుందని అంతా భావించారు. అయితే ఫుడ్ పార్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతల మధ్య సక్యత లేకపోవడం, రకరకాల రాజకీయ పార్టీలు రంగ ప్రవేశంతో జనసేన పార్టీ ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పరిశ్రమ అదే వేగంతో నడుస్తోంది. విస్తరణలో భాగంగా మరికొన్ని చోట్ల కూడా చెరువులు తవ్వి నీటిని వ్యర్ధ జలాలను వదులుతోంది. అయితే ఎప్పటికీ సమస్య తీరకపోయినా, కొత్త సమస్యలు వస్తున్న రాజకీయ కారణాలతో ఈ పెద్ద ఉద్యమం సైలెంట్ గా మారిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *