fbpx

కోడికత్తి సంఘటన గురుంచి చెబుతూ..అతడు సినిమా సన్నివేశం వివరించిన…వర్ల రామయ్య

Share the content

మర్డర్ జరగాలి..మనిషి మాత్రం మిగలాలి…ఇది అతడు చిత్రంలో విలన్ కోటా శ్రీనివాసరావు హీరో మహేష్ బాబుకు చెప్పే సన్నివేశం…ఇదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టిడిపి నాయకులు వర్ల రామయ్య ఆసక్తికర విషయాలు చెప్పారు. తన మీద హత్యా ప్రయత్నం జరగాలి….కానీ తనకు మాత్రం ఎటువంటి హాని జరగకూడదు…దెబ్బ వేసినట్లు ఉండాలి..దెబ్బ తగలకూడదు..హత్యా ప్రయత్నం చేసినట్లు ఉండాలి….మనిషి చావకూడదు….దీన్ని అడ్డుగా పెట్టుకొని రాజకీయ లబ్ధి పొంది..ముఖ్యమంత్రి అవ్వాలి…ఇన్ని కుట్రలు,కుతంత్రాల పన్ని కోడికత్తి కేసులో శ్రీను ను భాగస్వామిని చేశారని ఆయన విమర్శించారు.

కోడికత్తి కేసులో సిఎం జగన్మోహన్ రెడ్డి కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తూ శ్రీను తల్లి, సోదరుడు చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష శనివారం మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దీక్ష ప్రాంగణంలో వర్ల రామయ్య వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు మాటలు, అసత్య హామీలతో దళిత ఓట్లను దండుకోని జగన్మోహన్ రెడ్డి అధికారంలో కి వచ్చారని విమర్శించారు.ఐదేళ్ల నుంచి దళిత వర్గాల మీద ఇనుప పాదాన్ని మోపి అణగదోక్కుతున్నారని మండిపడ్డారు. అధికారాన్ని చేపట్టాలనే జగన్ పన్నిన కుట్రలో జనపల్లి శ్రీనివాస్ పావు కాదా అని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రథమ ముద్ధాయు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ..ఎన్ఐఏ కోడికత్తి కేసులో సరైన విచారణ జరపలేదని తెలిపారు.న్యాయ వ్యవస్థ కూడా దళితుల పట్ల అన్యాయంగా తీర్పులు చెపుతున్నాయని మండిపడ్డారు.

  • జగన్ పరిపాలనలో ఎస్సీల ఉనికికే ప్రమాదం : బోండా ఉమ
    అంబేద్కర్ వారసులు అయిన దళితుల మీద జగన్ రాక్షశనంద పొందుతున్నారని టీడీపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తరువాత నుంచి 300 మంది దళితుల పై హత్యలు జరిగాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్సీల ఉనికి కే ప్రమాదం వచ్చిందనీ పేర్కొన్నారు. శ్రీను, అతని కుటుంబానికి న్యాయ పరంగా టిడిపి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *