fbpx

తెలుగు జాతిపై ఎన్టీఆర్ చెరగని ముద్ర : కొండబాబు

Share the content

రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమూడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమే ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ…ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తన నటనా వైదుష్యంతో వెండితెర ధ్రువతారగా తెలుగు ప్రజల ఇలవేల్పుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ప్రజాదారణ పొంది ప్రజల హృదయాల్లో చిరస్మయనుడిగా ఎన్టీఆర్ నిలిచారని పేర్కొన్నారు.

తెలుగు ప్రజలకు సేవ చేయటం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి సాధించిన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో తొలిసారిగా వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, పెన్షన్ పథకం అమలు చేసి, పరిపాలనా సౌలభ్యం కోసం మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. తెలుగు జాతిపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ది మరణం లేని జననం అని కొనియాడారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ నందు నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ వద్ద నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శాంతినగర్ నందు సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, సీకోటి అప్పలకొండ, గదుల సాయిబాబా, కొల్లాబత్తుల అప్పారావు, MD ఆన్సర్, నల్లూరి శ్రీనివాసు, MA సయిద్, AVD మెంటారావు, పలివెల రవి, పందిరి బాబి, పసుపులేటి వెంకటేశ్వరరావు, గాది శివ, చింతలపూడి రవి, గెడ్డం పూర్ణ, బొచ్చా దాసు, గుత్తుల రమణ, మల్లాడి చిన్నా, వొలేటి పాండు, పినపోతు రాము, అంగడి దుర్గారావు, ఆలీషా, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *