fbpx

వైసిపి పీడిత వర్గాలను ఏకం చేయడమే లక్ష్యం : కొండబాబు

Share the content

వైసిపి ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తుని నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న కాకినాడ పార్లమెంటరీ స్థాయి సభ “రా కదిలి రా” బహిరంగ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి 58 బస్సులు, 160 కార్లు, ఆటో బైకులలో కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో తరలి వెళ్ళారు. వనమాడి కొండబాబు అమలాపురం మాజీ శాసనసభ్యులు ఐయితాబత్తుల ఆనందరావు, నియోజకవర్గ పరిశీలికలు నాగిడి నాగేశ్వరరావు, మెట్ల రమణబాబు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… వైసిపి ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేయాలనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక విధ్వంసక అవినీతి పాలన అంతమొందించడానికి రాష్ట్ర ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు.జగన్ రెడ్డి సాగిస్తున్న రాతి యుగాన్ని తరిమికొట్టి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారధ్యంలో స్వర్ణ యుగాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వైసిపి ప్రభుత్వ నాలుగేళ్ల పాలనంతా రద్దులు, గుద్ధులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేతలు, విధ్వంసాలు, అక్రమ కేసులు, తప్ప అభివృద్ధి లేదని, కమిషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలి పోయేలా చేశారని మండిపడ్డారు.

జగన్ రెడ్డి రాష్ట్ర యువత భవిష్యత్తును సర్వనాశనం చేసారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిపై చేయి పెట్టి సర్వనాశనం చేశారని, వైసిపి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు, అవస్థలకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అవినీతి పాలనలో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడం కోసమే చంద్రబాబు అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో పర్యటిస్తున్నరని పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి సారధ్యంలో నిర్వహిస్తున్న సభలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సభలను విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే వైసిపి ప్రభుత్వాన్ని తరిమే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అమలాపురం మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, చెల్లిబోయిన శ్రీనివాస్, నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సంఘాన్ని చిన్ని, తుమ్మల రమేష్, ఆమెన్ జైన్, ఒమ్మి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *