fbpx

ఎస్మా రద్దు చేయాలి..జీతాలు పెంచాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

Share the content

అంగన్వాడీ,మున్సిపల్,సమగ్ర శిక్ష కార్మికుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి లోగా పరిష్కరించాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.సోమవారం విజయవాడలో భాలోత్సవ భవన్ లో అంగన్వాడీ,మున్సిపల్ కార్మికులు,సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘాలకు మద్దతుగా సిపిఐ(ఎం) ఆధ్వరంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీలు డిసెంబర్ 12 నుంచి,సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు డిసెంబర్ 20 నుంచి,మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారని న్యాయమైన వారి కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. అంగన్వాడీ లు లక్షమంది కి పైగా అంగన్వాడీలు పిల్లలకు,గర్భిణులకు, సేవలందిస్తున్నారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ లో కంటే రూ 1000 లు అదనంగా వేతనం పెంచాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని వారు పేర్కొన్నారు.

భయ బ్రాంతులకు గురి చేస్తున్న ప్రభుత్వం: వర్ల రామయ్య
టిడిపి అధికార ప్రతినిధి వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేఖ పరిపాలన జరుగుతుందని విమర్శించారు. అంగన్వాడీ,మున్సిపల్ కార్మికులు,సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ హక్కుల కోసం,న్యాయ పరంగా వారికి రావలసిన రాయితి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే .. సమస్య పరిష్కారం గురుంచి ఆలోచించ కుండా,ఇబ్బందులు తెలుసుకోకుండా, బల ప్రయోగం చేసి, ఎస్మా ప్రయోగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తూ..మిగతా వారికి కూడా హెచ్చరిక జారీ చేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమని ,నిద్ర నటిస్తున్న ప్రభుత్వమని విమర్శించారు. అంగన్వాడీ ఉద్యమం మీద ఎస్మా ప్రయోగించడాన్ని టిడిపి తరుపున వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.సరైన ఆర్థిక విధానం లేకపోవడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయ్యిందని విమర్శించారు.

రక్షించే వారికే రక్షణ లేదు : లక్ష్మీనారాయణ
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు ఉన్నవ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..అంగన్ అంటే ఇంట్లో పరిధి అని అర్థమని అన్నారు. రక్షణ ఇచ్చేవారిని అంగన్వాడీ అంటామని తెలిపారు. ఎవరైతే మన ఇంట్లోనే రక్షణ కల్పించటానికి సృష్టించబడ్డారో…నేడు వారికే రక్షణ లేకుండా పోయింది అని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ లు అత్యవసర సేవల కిందకు వస్తారని చెప్పి ప్రభుత్వం ఈ నెల ఆరవ తారిఖున ఎస్మా చట్ట పరిధిలోకి చేర్చింది అన్నారు. ప్రభుత్వానికి అత్యవసర సేవల్లో ఉన్న వాళ్ళని తెలిసినప్లుడు .. వాళ్ళ డిమాండ్ల ను కూడా అత్యవసరంగా తీర్చాల్సిన భాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనీ గుర్తు చేశారు. అంగన్వాడీ లను అత్యవసర జాబితాలో చేర్చడం కాదని..వాళ్ల డిమాండ్లను అత్యవసరంగ తీర్చాలి అని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,ఆమాద్మీ, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *