fbpx

వైసిపి కి బిగ్ షాక్.. రూటు మార్చుకున్న రాయుడు.

Share the content

అధికార వైసిపికి బిగ్ షాక్ తగిలింది. పార్టీలోకి చేరి పది రోజులు గడవక ముందే అంబటి రాయుడు వైసిపి నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండనున్నానని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో పలు కార్యక్రమాలకు హాజరు అయ్యి, రాజకీయ ఆరంగేట్రం చేసిన రాయుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అని సొంత పార్టీ నేతలే “ఏమైంది బ్రో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

“నెట్టింట వైరల్ అయిన గుడివాడ,అంబటి
హైదరాబాద్ వలే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కొంత సమయం పడుతుందని,గుడ్డు పోధిగే దశలో ఉన్నదనీ ఐటి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసిన “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంలో క్రికెట్ బ్యాట్ లు విరగడంపై అంబటి రాయుడు ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ బ్యాట్ లు విరుగుతున్నాయి అంటే క్రికెట్ బాగా ఆడుతున్నారని, క్రికెట్ ఆడేవాల్లకే అది తెలుస్తుందని, ఆటలు ఆడని వాళ్ళకి ఆ విషయం తెలియదని వెల్లడించారు.అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

  • గుంటూరు పార్లమెంట్ స్థానమే అసలు విషయం ?
    రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం టిడిపి నే దక్కించుకుంది. అలాంటి స్థానంపై కన్నువేసిన వైసిపి.. రాబోయే ఎన్నికలకు బలమైన నేతను ఎంచుకునే క్రమంలో అంబటి రాయుడును ఎంపిక చేసుకున్నారు. ఐతే సీట్ల సర్దుబాటు విషయంలో నరసరావుపేట ఎంపి అయిన లావు కృష్ణదేవరాయలను గుంటూరు పార్లమెంట్ నుంచి భరిలోకి దిగాలని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఆ స్థానం గత రెండు ఎన్నికల నుంచి టిడిపి గెలుస్తున్న స్థానమని,అక్కడ పోటీ చేసి ఓడిపోయేకంటే రాజకీయాలు నుంచి సైలెంట్ అవ్వడం మేలని సిఎం కు ఎంపి వివరించినట్లు సమాచారం. తనకు హామీ ఇచ్చి కేటాయించిన గుంటూరు స్థానంలో వైసిపి మరో అభ్యర్థి కై అన్వేషణ చేయడం పట్ల రాయుడు అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. తన అత్యంత సన్నిహితులు,శ్రేయోభిలాషులు కూడా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన గెలిచే పరిస్థితి ఉండదని తెలిపినట్లు సమాచారం,అందులో భాగంగానే కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించి ఉండవచ్చు అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *