fbpx

స్మార్ట్ సిటీ నిధులను దోచుకున్న ద్వారంపూడి

Share the content

ఎదుటివారిని తిడితే పాపులరిటీ వస్తుందన్న బ్రమలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారని, పాపులారిటీ సంపాదించడంలో ఆయన శ్రీరెడ్డి తో సమానమని మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు విమర్శించారు.విమర్శించారు.శుక్రవారం కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పదవి వ్యామోహం కోసం ద్వారంపూడి ఎంతకైనా తెగిస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు అయిన ద్వారంపూడి చేతిలో కాకినాడ నగరం ఉందని విమర్శించారు.. ద్వారంపూడి చేస్తున్న అవినీతి, దౌర్జన్యం, దోపిడీతో కాకినాడ నగర అభివృద్ధి కుంటుపడిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కాకినాడ పర్యటనకు జగన్ రావటం వలన,కార్పొరేషన్ కు 2 కోట్లు వృద్దా తప్ప.. ఒరిగింది ఏమి లేదని తెలిపారు.

మోసపూరిత మాయ మాటలతోనే జగన్ రెడ్డి పాలన గడిచిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు నేడు పెన్షనర్లను కూడా మోసం చేశారని విమర్శించారు. అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల్లో ధైర్యంగా తిరగుతున్నామని చెప్తున్నారని..నిజంగా అభివృద్ధి చేసి ఉంటే భారీ కేడ్లు పరదాల మధ్య జగన్ రెడ్డి ఎందుకు తిరుగుతున్నారో, వాలంటీర్లు పోలీసులు సమక్షంలో ద్వారంపూడి ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన అవినీతి గురుంచి పదే పదే విమర్శించే ద్వారంపూడి ఈ నాలుగున్నర సంవత్సరకాలంలో ఎందుకు నిరూపించలేకపోయారో ప్రశ్నించారు. తాను మాత్రం ద్వారంపూడి చేసిన ప్రతి అవినీతిని సాక్షాలతో సహా నిరూపించడం జరిగిందని వెల్లడించారు.

అధికారులకు తప్పని ఇక్కట్లు

ద్వారంపూడి చేసిన అవినీతి వలన మడ అడవుల ధ్వంసం విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్, కమిషనర్ నేడు కేసులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సురేష్ నగర్ పార్క్ టి.డి.ఆర్. బాండ్ల పేరుతో 219 కోట్లు ద్వారంపూడి కొట్టేసారని, దీని వలన సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయ్యారనీ పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ప్రారంభించి గొప్పలు చెప్పుకునే ద్వారంపూడికి సిగ్గు ఉండాలని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ నిధులు కార్పొరేషన్ నిధులు దోచుకోవడం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుండి కాకినాడకు ఒక రూపాయి కూడా ద్వారంపూడి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. చదువు సంస్కారం నేర్పిస్తుందని, సినిమా హాల్లో బ్లాక్ టికెట్ అమ్ముకున్నవాడికి,సంస్కారం, కష్టం విలువ ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు.

ద్వారంపూడి స్పా సెంటర్ల ప్రాజెక్ట్

తిరుపతి దర్శనం టికెట్ లు అమ్ముకున్న వ్యక్తిత్వం ద్వారంపూడిదని ,కాకినాడ నగరానికి బ్రాందీ షాప్, స్పా సెంటర్లు లాంటి 2 పెద్ద ప్రాజెక్టులు తీసుకువచ్చి ప్రారంభించారని తెలిపారు. ఎడమ చేతి వాడటం వల్ల ఎడమ చేతితో ప్రారంభిస్తాడు కాబట్టి ఎవరూ పిలవరని ద్వారంపూడి విమర్శించడం జరిగిందని, అసలు ద్వారంపూడి ప్రారంభించినవి నేడు ఏ స్థితిలో ఉన్నాయో చూసుకోవాలని పేర్కొన్నారు.గాంధీ, మోడీ, సచిన్, రతన్ టాటా, మదర్ దేరిసా లాంటి వారు ఎడమ చేతి వాటం వాల్లే అన్న విషయం గర్వంగా చెప్పుకూంటానని పేర్కొన్నారు. ముత్తా గోపాలకృష్ణను అవమానపరచి,ఆయన పత్రికకు సంబంధించిన విలేకరులతో ధర్నాలు చేయించి, బహిరంగంగా అసభ్యకర దూషణలు చేసి నేడు ఓటమి భయంతో గోపాలకృష్ణ గారి పేరును జపం చేస్తున్నారని పేర్కొన్నారు.

తన పై పోటీకి భయపడుతున్న ద్వారంపూడికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పోటీ ఎందుకని విమర్శించారు. మరో మూడు నెలలు ఓపిక పడితే అక్కడ అవినీతి జగన్ రెడ్డిని, ఇక్కడ దోపిడీ చంద్రశేఖర్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, పలివల రవి, తుమ్మల రమేష్, కొల్లాభక్తుల అప్పారావు, ఒమ్మి బాలాజీ, సీకోటి అప్పలకొండ, గుజ్జు బాబు, బంగారు సత్యనారాయణ, బండి నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *