fbpx

కళ్లెదుటే వైసిపికి ఓటమి కనిపిస్తుంది..అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతుంది.

Share the content

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే వైసిపి వ్యతిరేఖ ఓటు చీలకుడదని ప్రకటించిన కార్యాచరణ జగన్మోహన్ రెడ్డికి కంటగింపుగా మారిందని తెలిపారు.అన్ని సామాజిక వర్గాలలో నిర్ధిష్టమైన శాతం,కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేన కు అండగా ఉండటం వైసిపి జీర్ణించుకోలేక పోతుందన్నారు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నదని విమర్శించారు. తాను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి,..పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతుందని వెల్లడించారు.వారి దూషణలను,నేను దీవెనలు గా తీసుకుంటానని తెలిపారు.

రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు కాంక్షిస్తూ తాను తీసుకొనే నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని తెలిపారు.ఎస్సీ,ఎస్టీ,బిసి,కులాల సాధికారత తో పాటు,అగ్ర కులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతకి దోహద పడాలన్నదే ఉద్దేశమన్నారు. తూర్పు కాపు,మత్స్యకార,శెట్టి,బలిజ,గౌడ,కొప్పుల వెలమ,పద్మశాలి, విశ్వబ్రాహ్మణ,నాయిబ్రహ్మన,రజక లాంటి బిసి కులాలు, సంఖ్య బలం లేని మాల,మాదిగ, ఎస్సీ కులాలు,ఎస్టీ ఉప కులాలను కలుపుకొని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉంది కాబట్టి పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరానన్నారు. రాబోయే ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని అందుకే కాపులలో అంతర్గత విబేధాలు తీసుకువచ్చే క్రమంలో కొందరు కాపు పెడ్డలను జనసేన మీదకు ప్రయోగిస్తున్నారు అని మండిపడ్డారు. వైసిపి ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణను, వార్తలను విస్వసించవద్ధని కాపు సామాజిక వర్గం తో పాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *