fbpx

మేధావి అన్నకు మేధావి చెల్లెలు షర్మిళ : బిజెపి

Share the content

రాష్ట్ర మేధావి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరైన మేధావి చెల్లెలు షర్మిళ అని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకమార్ తెలిపారు. వైయస్సార్ కారణంగానే హైదరాబాదులో మత ఘర్షణలు జరిగాయి.. దీనికి షర్మిళ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గురువారం విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రెండో రోజు పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో వేయి పైగా ఘర్షణలు జరిగాయిని పేర్కొన్నారు. ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో ఎన్నో మత ఘర్షణలు జరగలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించామన్నారు.

ఎపిలో డబల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా కేంద్ర బిజెపి ప్రభుత్వం సహకారం అందించిందిని పేర్కొన్నారు.వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా ఇది తేటతెల్లం అయిందన్నారు. బిజెపి చాలా రాష్ట్రాల్లో అయిదు నుండి పది పర్యాయాలు అయా రాష్ట్రాల్లో గెలిస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీ లు ఒక్క సారి గెలవడానికి ఆపసోపాలు పడుతున్నాయని విమర్శించారు. బిజెపి ఆయా రాష్ట్రాల లో అభివృద్ధి చేసి చూపిస్తోందని.. ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపిని ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. పొత్తుల అంశంపై చర్చించామని పేర్కొన్నారు.పొత్తులు పై మేము ఒక్కరం నిర్ణయం తీసుకునేది కాదని,మాతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్పందించాలని తెలిపారు.పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు జాతీయ పార్టీతో మాట్లాడాలని స్పష్టం చేశారు.బీజేపీ ని ఎపిలో బలోపేతం చేయడమే మాలక్ష్యం అని తెలిపారు. పొత్తు కోరుకున్న వాళ్ళు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు.

  • జనసేన మా మిత్ర పక్షమే: పురంధేశ్వరి
    రానున్న ఎన్నికలకు సంబంధించి పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానానిదే అని స్పష్టం చేశారు.షర్మిళ ఏ పార్టీలో చేరితే మాకెందుకని,బిజెపి బలోపేతం కోసం మేము పనిచేస్తామని తెలిపారు.జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ తో భేటీ మర్యాద పూర్వకమేనని వెల్లడించారు.శివప్రకాష్ ను కలవడానికే మనోహర్ వచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *