fbpx

మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలి.

Share the content

రాష్ట్రంలో వివిధ మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల,స్కూల్స్ స్వీపర్లు, డ్రైవర్లు, టాయిలెట్ వర్కర్స్, పార్క్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమళ్ళ సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. శనివారం కాకినాడలో పి.ఆర్.భవన్ లో యూనియన్ ఏఐటియూసీ అనుబంధ సంఘం సమావేశం నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమల్ల సుబ్బారాయుడు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోరుమల్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ నెల 27 తేది నుంచి సమ్మె ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగ,కార్మికులను పర్మినెంట్ చేసేంతవరకు ధరల అనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు మంజూరు చేయాలని తెలిపారు. పర్మినెంట్ పారిశుద్ధ్య,ఇంజనీరింగ్ కార్మికుల జిపిఎఫ్ ఖాతాలు సాంకేతిక సమస్యలు అంటూ ప్రభుత్వం వాయిదా వేయకుండా సత్వరమే పరిష్కరించాలని పేర్కొన్నారు. పర్మినెంట్ కార్మికులకు చెందిన 2021 నుంచి పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎన్కాష్మెంట్ కార్మికుల ఖాతాలో తక్షణమే జమ చేయాలన్నారు. జీవో నెంబర్ 30 ను సవరించి నాటి కార్మిక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్కిల్, సెమిస్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలు పెంచాలని కోరారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, టైమ్ స్కేల్ ఉద్యోగుల కార్మికులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.11వ పిఆర్సి ప్రకారం 20వేల రూపాయలు వేతనం,కరువు భత్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కోవిడ్ విపత్తులో పారిశుధ్య పనులకు తీసుకున్న కార్మికులను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న జరగనున్న మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ కరోనా విపత్తులో మరణించిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. క్లబ్ డ్రైవర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు మంజూరు చేసి,సాంఘిక భద్రత కల్పించాలని పేర్కొన్నారు. వీరిని ఆప్కాస్ చేర్చాలని, పిఎఫలలో కొన్ని నెలకొన్న సమస్యలు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఉండే పరిష్కరించాలని, ఇంజనీరింగ్ విభాగంలో మరియు నాన్ పిహెచ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు యధావిధిగా వర్తింప చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని, 62 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు గ్రాడ్యుటీ చెల్లించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ది రెడ్ల సత్యనారాయణ, సాకా రామకృష్ణ, కిషోర్, బొబ్బిలి ఈశ్వరరావు, ముత్యాల అప్పారావు, బొత్స శ్రీను, దలై ప్రకాష్, బంగారు రాజేష్, లక్ష్మణ్, అప్పన్న, సత్యనారాయణ, దుర్గ, తదితరుల జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *