fbpx

కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధం

Share the content

పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు తెలిపారు. బుధవారం నాడు విజయవాడలో ఆయన ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిజీహెచ్ లలోని అన్ని అర్టిపిసీఆర్ ల్యాబ్‌లు యాక్టివేట్ అయ్యాయని, రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు చేయాలని స్పెషల్ సిఎస్ డిఎంఈ,ఎండీ ఎపిఎంఎస్ఐడిసి లను ఆదేశించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో తగినంత ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు ఏర్పాటు చేయాలన్నారు.అవసరమైన మందులు, చేతి తొడుగులు, మాస్క్‌లు, శానిటైజర్లు వంటి పిపిఇ పరికరాలన్ని ఆసుపత్రులకు చేరాయుని పేర్కొన్నారు.ఎల్ఎంఓ, పిఎస్ఏ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, డి రకం సిలిండర్లు మరియు వెంటిలేటర్లు వంటి ఆక్సిజన్ సరఫరా ప్లాంట్లు పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.
జ్వరం, దగ్గు మొదలైన తేలికపాటి లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉండాలని,లక్షణాలు తగ్గే వరకు ఇతరులతో సంబంధాన్ని నివారించాలని సూచించారు. రాబోయే రోజుల్లో వివిధ పండుగల దృష్ట్యా, ముఖ్యంగా పెద్ద సమావేశాలలో కోవిడ్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కేరళ నుంచి తిరిగి వచ్చే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్త వహించాలని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పరీక్షించుకోవాలి అని పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా లేదని, దానిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర ఆరోగ్య యంత్రాంగం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *