fbpx

పెద్దాపురం వైసిపిలో రహస్య మంతనాలు

Share the content

పెద్దాపురం వైసిపిలో రెండు నెలలు కిందట అధిష్టానం తీసుకున్న నిర్ణయం పై ఇప్పుడు విబేధాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గం ఇన్చార్జి గా దవలురి దొరబాబు ను మార్చాలంటూ స్థానిక నేతలు శనివారం అంతరంగిక సమావేశం నిర్వహించారు.రెండు నెలలు కిందట పెద్దాపురం లో పర్యటించిన సిఎం జగన్మోహన్ రెడ్డి దవలురి దొరబాబు ను భారీ మెజార్టీ తో గెలిపించాలని సభలో కోరారు. ప్రస్తుతం రానున్న ఎన్నికలకు సంబంధించి ఉన్న ఇంఛార్జి లును కాదని వేరే వాళ్ళని నియమించిన అద్దంకి, సంతనూతలపాడు,
గుంటూరు పశ్చిమ స్థానాల్లో అధిష్టానం నిర్ణయం పై వైసిపి క్యాడర్ రెండు గ్రూప్లుగా విడిపోయింది. నియోజవర్గాల ఇంఛార్జి ల నియామకం పై కొన్ని స్థానాల్లో అసంతృప్తి లు బగ్గుమంటున్న వేళ పెద్దాపురంలో ఒక వర్గం మూకుమ్మడిగా రాజీనామాకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకర్గ వైసీపీ ఇంచార్జ్ దావులూరి దొరబాబుకు వ్యతిరేకంగా సమావేశమైన అసమ్మతి వర్గం ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దొరబాబును ఇంచార్జ్ పదవి నుండి తప్పించి మరొకరిని ఇంచార్జ్ ఇవ్వాలని అసమ్మతి వర్గ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *