fbpx

గృహాల నిర్మాణాలలో పూర్తి నాణ్యత ప్రమాణాలు

Share the content

నవరత్నాలు పథకంలో భాగంగా పేదలకు పూర్తి మౌలిక సదుపాయాలతో కూడిన గృహాలను నిర్మించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ,విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ సహకారంతో ఆఫర్డ్బుల్ హౌసింగ్ పై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ఆర్థిక సంస్థలకు,లెండింగ్ సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్లు,నీటి సౌకర్యం,కాలనీలకు విద్యుదీకరణ,డ్రైనేజ్ ల మౌలిక సదుపాయాల కొసం ప్రభుత్వం రూ.35,000 కోట్లు కర్చు చేస్తోందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం కు చెందిన జల జీవన్ మిషన్ కింద తాగునీటి కనెక్షన్, విద్యుత్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిందని,పట్టాల పంపిణీ కొరకు అవసరమైన భూమి కోసం 33 వేల కోట్ల రూపాయలును మంజూరు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.ఇంతవరకు 26 వేల కోట్ల రూపాయలును ఇళ్ల నిర్మాణానికి వినియోగించామని పేర్కొన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో 11 విభాగాలకు చెందిన సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు గృహ నిర్మాణాల అమలు పై సమీక్షలు చేస్తున్నారని వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి కృషి ప్రశంశనీయం

హాబిటాట్ హ్యుమానిటీ ఇండియా నేషనల్ డైరెక్టర్ జేమ్స్ శ్యాముల్ మాట్లాడుతూ వై.యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారని,ప్రస్తుతం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇల్లు నిర్మాణానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి,విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీ చైర్మన్ డి.చక్రపాణి మాట్లాడుతూ ఆర్థిక సంస్థలు,రుణాలు ఇచ్చే ఏజెన్సీలు ప్రజల ఆరోగ్య సంరక్షణపై దృష్టి కేంద్రకరించాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు కుటుంబ ఆరోగ్య సంరక్షణపై ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివ ప్రసాద్ గృహ నిర్మాణ సంస్థ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మనోహర్ మిరియాల, హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ డైరెక్టర్ జస్టిస్ జెబకుమార్,ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ట కన్సల్,ప్రాజెక్ట్ మేనేజర్ పాల్ రాజ్ కుమార్,ఆపరేషనల్ డైరెక్టర్ రాజు తమ సంస్థల పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *