fbpx

ట్రీట్మెంట్ ప్లాంట్ తో మత్స్య సంపదకు కృషి

Share the content

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 218 వ రోజున ఆదివారం తుని నియోజక వర్గంలో కొనసాగుతున్నది. ఇటీవల తుఫాను దెబ్బకు నష్టపోయిన రైతుల,మత్స్యకారుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఒంటిమామిడి మత్స్యకారులు లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తొండంగి మండలంలో 14 మత్స్యకార గ్రామాలు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నయని అరబిందో ఫార్మసి,దివీస్ ఫార్మా కంపెనీలు తమ విష వ్యర్థాలను సముద్రంలోకి పైపులైన్ల ద్వారా వ్యర్ధాలను వదులుతున్నారని లోకేష్ ఎదుట వాపోయారు. సముద్రపు నీరు విషతుల్యమై మత్స్య సంపద పూర్తిగా నశించిపోతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. 14 గ్రామాల ప్రజలకు చేపల ఉపాధి దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ఫైబర్ బోట్లు, ఇంజిన్లు, వలలు, ఐస్ పెట్టెలు సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. ఫిషర్ మ్యాన్ హౌసింగ్ స్కీం క్రింద ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు రుణసాయం అందించాలని తెలిపారు. లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచి వైసిపి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత టిడిపి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి రూ.800 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. తీరప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసినపుడు మత్స్యసంపద నష్టపోకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంటుందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక “ట్రీట్మెంట్ ప్లాంట్లను” ఏర్పాటుచేసి మత్స్యసంపద దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పరిశ్రమల వ్యర్థాలను శుభ్రం చేసిన తరువాతనే సముద్రం లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలు ఉన్నప్పుడే ఉపాధి దొరుకుతుందని,పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు. ఇళ్లులేని మత్స్యకారులందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఆదరణ పథకంతో సహా మత్స్యకారులకు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రాబోయే టిడిపి ప్రభుత్వంలో కచ్చితంగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.

  • పకడ్బందీగా పంటల భీమా అమలు
    తుని నియోజకవర్గం ఒంటిమామిడి సమీపంలోని తుపాను కారణంగా దెబ్బతిన్న వరిపొలాలను లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంటనష్టపోయిన కౌలు రైతులు కాకాడ సత్యనారాయణ, యనమల వీరబాబు, ఎన్నా బాబ్జి మాట్లాడుతూ… పంట చేతికొచ్చే సమయంలో తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని,ఎకరాకు రూ.30వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని కష్టమంతా తుపాను పాలయిందని ఆందోళన వ్యక్తం చేశారు.లోకేష్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో వెనువెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసి హడావిడిగా బయటకొచ్చి తూతూ మంత్రపు పరామర్శలు చేశారన్నారు.పంటలబీమా సొమ్మును తామే చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 16మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించిందంటే రైతులపట్ల ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చనని అన్నారు.టిడిపి , జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న సమయంలో కౌలురైతులకు కూడా పరిహారం అందేలా చట్టాన్ని సవరిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *