fbpx

షర్మిల రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే..

Share the content

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేయడం ద్వారా వైయస్ షర్మిల దాదాపు తెలంగాణలో పార్టీ మూత బడినట్లే అని రాజకీయ విశ్లేషకులు మాట. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో విలీనం విషయంలో రాయబారాలు నడిపిన షర్మిల ఏ షరతును కాంగ్రెస్ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో విలీనంపై వరకు తగ్గి తెలంగాణలోని అన్ని సీట్లలో పోటీ చేస్తాము అని ప్రకటించి.. అవసరం అయితే తల్లి విజయలక్ష్మి భర్త అనిల్ కూడా పోటీలో దిగుతారు అని షర్మిల ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు తమ పార్టీ నుంచి సీటు కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల చెప్పారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో పాటు పోటీలు ఉంటే ఉన్న పరువు కూడా పోయే అవకాశం ఉండడంతో షర్మిల తన పార్టీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు పాలేరు నుంచి తాను పోటీలో ఉంటాను అని ప్రగల్బాలు పలికిన షర్మిల దాని మీద కూడా నోరు విప్పలేదు. షర్మిల పార్టీ దాదాపు తెలంగాణ నుంచి కనుమరుగు కలవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

** ఆర్థికంగా పార్టీ కోసం చాలా ఖర్చు చేసి చాలా సమయం వెచ్చించి పాదయాత్రలు చేయడం ద్వారా షర్మిల సాధించింది పెద్దగా ఏమీ లేదు. అసలు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడమే షర్మిల చేసిన మొదటి తప్పు. సమైక్యవాదిగా గుర్తించే షర్మిలను ఏ కోసానా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అలాంటిది పార్టీ పెట్టి ఆర్థికంగా కూడా బాగా ఖర్చు చేసిన షర్మిల.. పాదయాత్ర ద్వారా కూడా కష్టపడ్డారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అలాగే హైదరాబాదులో సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షర్మిల దృష్టి సారించినప్పటికీ షర్మిల పార్టీని తెలంగాణ జనం ఏమాత్రం నమ్మలేదు. చివరకు ఆమె పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులూ కూడా ఎవరు చేరలేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి కి అలాగే జగన్కు దగ్గర అయిన కొందరు తెలంగాణ నేతలు కూడా షర్మిల పార్టీ వైపు చూడలేదు. చాలామంది కూడా షర్మిల చేస్తుంది చాలా తప్పు అని తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఆమె పూర్తిగా దెబ్బతింటుందని ముందుగానే అంచనా వేశారు. జగన్ తో ఏమైనా గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఉంటే ఆమె ఆంధ్రలో పోరాడాలి తప్ప తెలంగాణలో ఆమెకు పని ఏంటి అని అడిగిన వారు ఉన్నారు. కొన్ని రోజులు తెలంగాణలో కీలకమైన నేతల మీద ఇష్టానుసారం మాట్లాడిన షర్మిల.. పోలీసులతోనూ గొడవలు పెట్టుకుని దానిని సంచలనం చేయాలని చూశారు. కెసిఆర్ ను సూటిగా సుత్తి లేకుండా తిట్టినప్పటికీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం వెనక పడ్డారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని కలిపి వేసి రాజ్యసభ సీటుతో పాటు ఇతర కీలకమైన బాధ్యతలు కావాలని షర్మిల అడిగినప్పటికీ కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి సరైన స్పందన లేదు. ఎలాంటి హామీలు లేకుండానే కాంగ్రెస్ నాయకత్వం షర్మిల విషయంలో ఆచితూచి అడుగులు వేసింది. దీంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా షర్మిలకు అడ్డుపడ్డారు. దీంతో కాంగ్రెస్లో విలీనం కుదరకపోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో వైఎస్ఆర్ టిడిపి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అని షర్మిల చెప్పినప్పటికీ ప్రజల నుంచి ఏమాత్రం స్పందన లేకపోయింది. దీంతో చేసేది లేక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కనబడక షర్మిల పూర్తిగా పోటీ నుంచి తప్పుకున్నారు. చెప్పడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే కోణంలోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నప్పటికీ పార్టీని నడపడం ఎంత పెద్ద కష్టమో షర్మిలకు పూర్తిగా తెలిసి వచ్చింది. తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత దాదాపు షర్మిల మళ్లీ రాజకీయ రంగంలో ఉండకపోవచ్చు అని ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఒకవేళ ఉంటే ఆమె ఎటువైపు స్టాండ్ తీసుకుంటారు అన్నది కూడా కీలకమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *