fbpx

టీడీపీ అధినేత పై కేసుల వెనుక పెద్ద కుట్ర

Share the content

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఐదో కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సిఐడి కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. చంద్రబాబుతో పాటు మాజీమంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వరావులపై కేసులు నమోదు చేసింది. దీంతో చంద్రబాబుపై ఇసుక విషయంలో నమోదు చేసిన కేసు ఐదోది కానుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, అమరావతి రింగ్ రోడ్డు కేసు, మద్యం తయారీ విషయంలో కేసు నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఇసుక విషయంలోనూ కేసు నమోదు చేయడం ద్వారా చంద్రబాబును పూర్తిస్థాయిలో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. ఒక కేసు తర్వాత మరోకటి పెట్టడం ద్వారా చంద్రబాబును అన్ని విధాలుగాను జైలు లో ఉంచేలా పెద్ద ప్లానింగ్ వేసినట్లు అర్థం అవుతోంది. వీటిని తెలుగుదేశం పార్టీ న్యాయపరంగా ఎలా ఎదుర్కొంటుంది అన్నది కూడా కీలకమే.

** జగన్ ప్రభుత్వం బనాయిస్తున్న కేసులపై ఇప్పటికిప్పుడే చంద్రబాబుకు పెద్దగా కష్టం ఉండకపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న బెయిల్ కనుక రద్దు అయితే పూర్తిస్థాయిలో చంద్రబాబు మళ్ళీ జైలులో మగ్గాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మధ్యంతర భైయులను పొడిగించుకోవడం పైనే చంద్రబాబు దృష్టి సారించాలి. ఆయన ఆరోగ్య కారణాలను అలాగే వయసు రిత్యా ఉన్న ఇతర పరిస్థితులను కోర్టుకు చెప్పి ప్రస్తుతం ఉన్న మధ్యంతర బెయిల్ క్రమంగా పొడిగించుకొని, ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో దానిని వినియోగించుకునే ఆలోచన చంద్రబాబు చేయొచ్చు తప్ప… ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇరికిస్తున్న కేసుల నుంచి మాత్రం ఆయన బయటపడడం దాదాపు అసాధ్యం. ఇప్పటికే క్వాష్ పిటిషన్ విషయంలో రకరకాల భిన్న అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో… మధ్యంతర బెయిల్ కావాలని ఆరోగ్య కారణాలను చూపుతూ తెలుగుదేశం పార్టీ వేసిన పిటిషన్ ను కోర్టు ఆమెదించింది. నవంబర్ 28వ తారీకు వరకు ఈ మధ్యంతర బెయిల్ పనిచేస్తుంది. దాని తర్వాత మళ్లీ చంద్రబాబు కోర్టును ఆశ్రయించి.. తన ఆరోగ్య పరిస్థితులను సాకుగా చూపి బెయిల్ ను పొడిగించుకోవలసిన అవసరం ఉంది. దీనిని న్యాయస్థానం ఎలా తీసుకుంటుంది అలాగే రాజకీయంగా దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కొనబోతున్నారు అన్నది కీలకం. ప్రస్తుతం ఆరోగ్య కారణాలను చూసి తాత్కాలిక బెయిల్ పొంది బయట ఉన్న చంద్రబాబును మళ్లీ వివిధ కేసుల్లో ఇప్పటికీ ఇప్పుడు అరెస్టు చేయడం దాదాపు న్యాయపరంగా అసాధ్యం. చంద్రబాబు ఇప్పటికే తన ఆరోగ్య కారణాల వల్ల మాత్రమే బెయిల్ కావాలని కోరడంతో ఇతర కేసులను పెట్టి ఆయన ఎప్పటికీ ఇప్పుడు అరెస్టు చేస్తే మళ్లీ అది ఆరోగ్య సమస్య కోసం ఓటు ఇచ్చిన బెయిల్ ను తోసి పుచ్చడమే అవుతుంది. కాబట్టి న్యాయపరంగా ఎప్పటికీ ఇప్పుడు చంద్రబాబును వివిధ కేసుల్లో అరెస్టు చేయడం దాదాపు అసాధ్యమే అయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఆయనకు కేసుల కలవరం తప్పకపోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కనుక వైసిపి మళ్లీ గెలిచి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడానికి ఈ కేసులు కచ్చితంగా పనికి వస్తాయి. తెలుగుదేశం పార్టీని పూర్తిస్థాయిలో అంతం చేయడానికి కూడా ఈ కేసులను జగన్ వాడుకునే అవకాశం లేకపోలేదు. ఒక కేసు తర్వాత మరొకటి పెట్టి చంద్రబాబును రాజకీయంగా ఇరికించడానికి కూడా జగన్ ఈ కేసులను వాడుకునే వీలు ఉంది. ఇప్పటికిప్పుడు చంద్రబాబును దెబ్బ కొట్టకపోయినా భవిష్యత్తులో చంద్రబాబుతో సహా ఆ పార్టీని గట్టిగా రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ కేసులు ఉపయోగపడతాయి. భవిష్యత్తును ఆలోచించే ప్రస్తుతం ఉన్న సింపతీని కూడా లెక్కచేయకుండా జగన్ కేసుల మీద కేసులు పెట్టడం వెనుక భవిష్యత్తు రాజకీయ ఆలోచన దాగి ఉంది అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ఎల్లకాలం జైలులో ఉంటే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లడం కూడా దాదాపు అసాధ్యమే. దీంతో ఆ పార్టీలో జరగరానిది ఏం జరిగినా సరే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాయం అవుతుంది అన్న రాజకీయ కుట్ర దీనిలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *