fbpx

హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన పవన్

Share the content

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీ తెలంగాణలోని 32 స్థానాల్లో పోటీ చేసేందుకు తమ అభ్యర్థులను సమయత్వం చేస్తున్న సమయంలో బిజెపి పెద్దలనుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఒత్తిడి మేరకు కాస్త వెనక్కు తగ్గారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ఉండాలని బిజెపికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే బిజెపి పెద్దలనుంచి వచ్చిన సూచనలు మేరకు పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ తెలంగాణలో నిలబెట్టాలని దృష్ట్యా కచ్చితంగా కొన్ని సీట్లను తమకు కేటాయించాలని బీజేపీ పెద్దలను అడగాలని నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అప్పటికప్పుడు అపాయింట్మెంట్లు సిద్ధం కావడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని వెంటపెట్టుకొని మరి ఆయన ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం సాయంత్రానికి తెలంగాణలో పోటీ చేసేది లేనిది అక్కడ ఉన్న పరిస్థితి జనసేనకు పొత్తుల్లో భాగంగా ఇచ్చే సీట్లు తదితర విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

** ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఎన్డీఏ ఇతర భాగస్వామ్య పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం కనీసం బిజెపి పెద్దలను పవన్ కళ్యాణ్ కలిసి ఈ విషయం చెప్పకుండానే పొత్తు ఖరారు చేసుకోవడం అప్పట్లో బీజేపీ పెద్దలను కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ తర్వాత పరిణామాలను బిజెపి పెద్దలు తమకు అనుకూలంగా మరలచుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమాన బలం ఓట్లుగా మారాలని అది కచ్చితంగా బిజెపికి ఉపయోగపడుతుందని అంచనాకు వచ్చిన కేంద్ర పెద్దలు జనసేన మద్దతును తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. అమిత్ షా తో మొదట అపాయింట్మెంట్ తర్వాత జేపీ నడ్డా తో కూడా మరో అపాయింట్మెంట్ ఉండడంతో ఆయన తెలంగాణ రాజకీయాలను అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవలసిన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. కచ్చితంగా బిజెపి కేంద్ర పెద్దలు చెప్పినట్లుగానే నడుచుకునేలా మానసికంగా పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అయితే పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు తదితర విషయాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *