fbpx

కార్యకర్తల్లో సమన్వయానికి మొదటి ప్రాధాన్యం

Share the content

రాజమండ్రి వేదికగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగడం వరకు బాగానే ఉన్నప్పటికీ… ఇకనుంచి తరచూ ఇలాంటి సమావేశాలు జరిగితేనే కాస్త రెండు పార్టీల కార్యకర్తల్లో కూడా కాసింత ఆత్మస్థైర్యం ఎన్నికలకు సిద్ధం కావాలని తపన కనిపించేలా కనిపిస్తోంది. ఏదో ఒక సమావేశం పెట్టి వెళ్లిపోతే కార్యకర్తలు కలిసి పని చేసేందుకు చాలా సమస్యలు ఏర్పడతాయి. నాయకులు చొరవ తీసుకొని రెండు పార్టీల అగ్ర నేతలు అలాగే సీనియర్ నేతలు కలిసి తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన సందేశం పంపడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరి కార్యక్రమాలు వారు చేసుకున్న అది మీడియా పరంగా గానీ, కార్యకర్తల ఐక్యత పరంగా గాని చెడు సందేశం వెళ్లే అవకాశం ఉంది.

** రాజమండ్రి వేదికగా జరిగిన ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఎక్కువగా రెండు పార్టీల కార్యకర్తలు నాయకులు కోఆర్డినేషన్ మీద చర్చ ఎక్కువగా జరిగింది. రెండు పార్టీలకు సంబంధించి పొత్తు వల్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు అని భావించినప్పటికీ.. అది ఎక్కడో తేడా కొడుతున్న తరుణంలో ఖచ్చితంగా దీనిని సరి చేయాల్సిన బాధ్యత రెండు పార్టీల అగ్రనాయకత్వం మీద పడింది. దీంతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కచ్చితంగా కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో పొత్తు విషయంలో పాజిటివ్ సంకేతం తీసుకురాకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమని రెండు పార్టీల అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈనెల 29 నుంచి రెండు పార్టీల నాయకులు కార్యకర్తల సమావేశాలను ఎన్ని జిల్లాల్లో పెట్టడం చాలా మంచి పరిణామం. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అది వారికి మంచి బూస్టప్ ఇస్తుంది. కేవలం ఎక్కడితో ఆగిపోకుండా తరచూ రెండు పార్టీల కార్యకర్తలు నాయకుల్ని కలిసి కార్యక్రమాలు చేయడం ద్వారా వారిలో సమన్వయం పెరిగే అవకాశం ఉంది. 100 రోజుల ప్రణాళిక అంటూ ప్రకటించిన లోకేష్ కచ్చితంగా దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెబుతున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు కలిస్తేనే వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం. అలా కాకుండా ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి దిగజారిన అది కచ్చితంగా వైసీపీకి లాభం. ఏమాత్రం చిన్న తడబాటు ఉన్న దానిని క్యాచ్ చేయడానికి వైసిపి సిద్ధంగా ఉంది. దీనిని రెండు పార్టీల కార్యకర్తలు గుర్తు ఉంచుకొని సంయుక్తంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ముందు వైసీపీని గద్దె దించిన తరువాత పదవుల పంపకం అనే విషయాన్ని నాయకులు మరింతగా కార్యకర్తల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. లేకుంటే వచ్చే ఎన్నికల్లో రకరకాల రూమర్లు ప్రచారం మొదలుపెట్టడానికి వైసిపి సోషల్ మీడియా బలంగా ఉంది. దీనిని రెండు పార్టీల కార్యకర్తలు ఎలా ఎదుర్కొంటారు అన్నదానిమీద వచ్చే ఎన్నికల్లో ఫలితం ఆధారపడి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *