fbpx

బీజేపీని ఒప్పించే ప్రయత్నం

Share the content

బిజెపి పెద్దలను కచ్చితంగా ఒప్పించే పద్ధతిలో తెలుగుదేశం – జనసేన పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి సహాయం లేకుంటే కచ్చితంగా జగన్ ను టీ కొట్టడానికి అనేక అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తున్నారు. భారీ స్థాయిలో దొంగ ఓట్లు, రిగ్గింగ్, అల్లర్లు కూడా జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కచ్చితంగా అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగించే అవకాశం ఉండడంతో బిజెపి కచ్చితంగా సహకరిస్తే తప్ప ఎన్నికలు సజావుగా జరగడానికి అలాగే జగన్ను దీటుగా ఎదుర్కోవడానికి అవకాశం ఉండదని తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే జనసేన నేతలు భావిస్తున్నారు. లోకేష్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లి అత్యంత రహస్యంగా చేసిన పని ఏమిటి అంటే.. మధ్యవర్తుల ద్వారా బిజెపి పెద్దలను ఒప్పించడానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో తాము గెలిచే అన్ని సీట్లను బిజెపికి మద్దతు ఇచ్చేలా చూసుకుంటామని ఎన్డీఏ లో కలుస్తామని లోకేష్ ద్వారా మధ్యవర్తులతో చెప్పి పంపినప్పటికీ అటు నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు మరొకసారి వేరే పద్ధతులు ద్వారా కలవాలని లోకేష్ కు హితోపదేశం చేసి మళ్లీ ఢిల్లీ పంపారు. కేంద్రం ఒప్పుకుంటే తప్ప ఈసారి లోకేష్ మళ్లీ వెనక్కు వచ్చే అవకాశాలు లేవు. కేంద్రం చెప్పిన అన్ని షరతులకు ఒప్పుకొని సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ బిజెపికి మద్దతు ఇస్తుందని లోకేష్ కేంద్ర పెద్దల వద్ద బలమైన హామీ ఇచ్చి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు జనసేనని పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కూడా బిజెపి పెద్దలను బ్రతిమలాడే ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాలేదని వారితోనే ఉన్నామని చెబుతూనే ఇటీవల తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో ఎందుకు ముందుగా ఢిల్లీ పెద్దలకు చెప్పలేకపోయాను అన్న విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీ వెళ్దామని అనుకున్నప్పటికీ అప్పటి పరిస్థితులు బట్టి జి20 సదస్సు ఉండడంతో వెళ్లలేకపోయానని ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కచ్చితంగా బిజెపి కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా వారిలో ఆశలు బలంగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఇటువైపు లోకేష్ అటువైపు పవన్ కళ్యాణ్ కూడా బిజెపిని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో మద్దతును ఎన్నికల అనంతరం ఇస్తామని.. ఈ ఒక్కసారి కి కచ్చితంగా తమకు సహకరించాలని కేంద్ర పెద్దల వద్ద వీరు వేడుకుంటున్నారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది కాలం నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *