fbpx

బీజేపీ చంద్రబాబును చచ్చినా నమ్మదు

Share the content

అసలు చంద్రబాబు ని మోదీ ఎందుకు నమ్మరు?? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టే పరిస్థితి లేదని బిజెపి అధినాయకత్వం ఎందుకు తేల్చి చెబుతోంది..? రాష్ట్రంలోని పరిస్థితిని గమనిస్తున్న బిజెపి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులతో అసలు మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడడం లేదు..? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదేపదే బిజెపి పెద్దలను తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించిన అక్కడి నుంచి సానుకూలంగా ఎందుకు స్పందన రావడం లేదు..? ఇప్పుడు హడావుడిగా లోకేష్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసేందుకు ఎందుకు వెళ్తున్నారు..? ఈ ప్రశ్నలు అన్నింటికీ మూలం వెతుక్కోవాలి అంటే కచ్చితంగా 2018 చివరి నాటికీ వెళ్లాల్సిందే. 2014లో కలిసి పోటీ చేసి గెలిచిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేనలు తర్వాత కాలంలో ఎవరు దారి వారు చూసుకున్నారు. ముఖ్యంగా 2018 చివరి నాటికి వచ్చేసరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిగా బిజెపిని తిడుతూ, కేంద్రం చాలా ద్రోహం చేసింది అనేలా సభలు నిర్వహించారు. అప్పటివరకు ప్రభుత్వంతో ఉన్న బిజెపి నాయకులను ఇష్టానుసారం తిడుతూ చంద్రబాబు నిర్వహించిన సభలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఏకంగా మోడీ కుటుంబ సభ్యులును కూడా వదలకుండా చంద్రబాబు దూషించడం అప్పట్లో తీవ్రదుమారాన్ని రేపింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పులు అన్ని కేంద్రం మీద తోసేసి ఎలాగైనా 2019 ఎన్నికల్లో గట్టు ఎక్కాలని చంద్రబాబు చేసిన పన్నాగం విజయం సాధించలేదు. దీంతోపాటు కేంద్రంలో కూడా ఖచ్చితంగా బిజెపి ప్రభుత్వం రాకూడదు అనే రీతిలో చంద్రబాబు కాంగ్రెస్కు వెనకనుంచి సహకరించారు అని బిజెపి వద్ద పక్కా సమాచారం ఉంది.

కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా కూడా చంద్రబాబు సహకరించారు అని బిజెపి పెద్దలు అప్పట్లోనే పూర్తిస్థాయిలో చంద్రబాబు తీరు మీద వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్నారు. 2019లో ఆటు కేంద్రంలో బిజెపి రావడం ఇటు రాష్ట్రంలో చంద్రబాబు పాచిక పారకపోవడం తో మొత్తం సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు వేసిన గాలం ఆయనకే మళ్లీ రివర్స్ వచ్చింది. మొత్తం చంద్రబాబు ప్రణాళిక భూమారం రీతిలో చంద్రబాబుకే అపాయం తెచ్చేలా మారిపోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని రాజకీయ పండితులు చెబుతున్నారు. కచ్చితంగా బిజెపికి ప్రత్యామ్నాయ కూటమికి చంద్రబాబు సహకరించే రీతిలోనే రాజకీయం చేశారు అనేది పక్క సమాచారం. దీంతోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం పెద్దలు ఇప్పటికీ చంద్రబాబుని నమ్మలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజకీయం ఫుల్ స్టాప్ పడితేనే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక తయారవుతుందని బిజెపి నమ్ముతోంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంతర్దానం అయ్యేవరకు బిజెపి రాష్ట్రంలోని రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగు అయిన తర్వాతనే రాష్ట్రంలో బలంగా తయారు కావచ్చని, చంద్రబాబు దోస్తీ వల్ల చివర్లో వెన్నుపోటు తప్పదని బిజెపి నమ్ముతోంది. దీంతోనే ఎప్పటికీ ఇంత కష్టకాలంలోనూ బిజెపి పెద్దలు చంద్రబాబుకు ఏమాత్రం సహకరించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *