fbpx

క్వాష్ పిటిషన్ మాత్రమే ఎందుకు??

Share the content

చట్టం చట్రంలో ఇరుక్కున్న తర్వాత మళ్లీ దాని నుంచి బయటపడాలి… ఏం తప్పు చేయలేదు అనుకోవడం దాదాపు అసాధ్యం. అందులోనూ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ ను న్యాయమూర్తి పరిశీలించి విచారణకు ఆమోదించిన తర్వాత కూడా ఏ తప్పు జరగలేదు అని వాదించడం పూర్తి మూర్ఖత్వమే అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులో టిడిపి నేతలు అలాగే ఆయన తరఫు న్యాయవాదులు చేస్తున్న వాదన ఇదే. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అవినీతి ఏమాత్రం జరగలేదు అన్నది క్వాష్ పిటిషన్ సారాంశం.

** ఇప్పటికే చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు కూడా తోసిపుచ్చింది. ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో చంద్రబాబు తరఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నేరం చట్ట పరిధిలోకి వెళ్లి పోయినప్పుడు ముందుగా బెయిల్ పిటిషన్ మీద చంద్రబాబు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించాల్సింది. చంద్రబాబు వయసు ఆయన ఆరోగ్యం ఇతరత్రా వ్యవహారాలను సాకుగా చూపి బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినిపించి ఉంటే కచ్చితంగా చంద్రబాబు ఇప్పటికే బయటికి వచ్చేవారు. అయితే దానిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం నేరం జరగలేదు అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఏమాత్రం జరగలేదు అన్నవాదనకే తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. చంద్రబాబు కోర్టులో ఉంటే ప్రజల సింపతి మరింత పొందవచ్చు అన్నది రాజకీయ వ్యూహంలో ఓ భాగంగా చెప్పుకోవచ్చు. దీంతోనే పూర్తిగా నేరం జరగలేదు అన్న వాదనను తెరపైకి తెస్తున్నారు తప్పితే చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ముందుగా బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత న్యాయమూర్తి పాజిటివ్గా స్పందించి బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అలాకాకుండా చంద్రబాబును జైలులోనే ఉంచి బెయిల్ పిటిషన్ వేయకుండా ముందుగా నేరం జరగలేదు అన్నవాదనకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు బయటకు ఇంకా రాలేదు. తెలుగుదేశం పార్టీ ఆదేశాలతోనే న్యాయవాదులు ఈ పని చేస్తున్నట్లుగా భావించాలి. సిద్ధార్థ లుద్ర దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లాయర్లలో ఐదో వ్యక్తి. ఆయనకు ఇప్పటికే చాలా మొత్తం ఇచ్చి ఉండాలి. అయినా ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు అంటే ఈ కేసులో క్వాష్ పిటిషన్ అనేది పనిచేయదు అని అర్థం చేసుకోవాలి. చంద్రబాబును మరికొన్ని రోజులపాటు జైల్లోనే ఉంచి ప్రజల సింపతి పొందేందుకు తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆరాటపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద ఎక్కువగా వాదనలు జరపకుండా కేవలం క్వాష్ పిటిషన్ కు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా చంద్రబాబు మచ్చ అంటుకొని నాయకుడిగా వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో చూపించాలి అనే ఉద్దేశం కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *