fbpx

పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే..!!

Share the content

అటు వచ్చి ఇటు వచ్చి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేనకు కాలం కలిసి వచ్చేలా కనిపిస్తోంది. వచ్చి ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరామర్శించేందుకు ములాకత్ కోరారు. దీనికి ఇప్పటికే ఆయనకి అనుమతులు వచ్చాయి. చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి ఆయనకు అన్ని విధాల అండగా నిలబడుతున్న జనసేనని రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. లోకేష్ ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తారు అని సంకేతాలు వస్తుండడంతో ఎన్నికల ముందు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలను కలిపి నడిపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద పడినా పడవచ్చు. దీనిపై రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకత్ సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వద్ద నుంచి ఎలాంటి సూచనలు అందుతాయి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. చంద్రబాబు కనుక ఒక అడుగు ముందుకు వేసి టిడిపి శ్రేణులను మొత్తంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అనుసంధానం చేసేలా కనుక ఆదేశాలు కనుక ఇస్తే ఇది కచ్చితంగా జనసేనకు ప్లస్ అవుతుంది. అలాకాకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ లేకుండా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో నాయకత్వం లేనితో ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తెలుగుదేశం పార్టీ బిజెపి పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది అన్న ఇప్పుడు కొత్త వాదన తెర మీదకు వస్తోంది. చంద్రబాబు ఇప్పట్లో బయటికి రాకుండా పూర్తిస్థాయిలో కేసులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న జగన్ ప్రభుత్వం… త్వరలోనే లోకేష్ ను అరెస్టు చేసి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేని పార్టీగా తయారు చేయాలని భావిస్తోంది. దీనికి కేంద్రంలోని బిజెపి కూడా తన వంతు సహకారం అందిస్తూఉండడంతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ కి పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవడమే ప్రధాన లక్ష్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జనసేన టిడిపి కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను కనుక ప్రకటిస్తే అన్ని వైపుల నుంచి అనుకూల అంశాలు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నారు. అయితే దీనిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలా తీసుకుంటాయి ఏమిటి అన్నది మాత్రం ఇప్పుడే తేలని ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *