చంద్రబాబు నాయుడు అరెస్టు మీద జాతీయస్థాయి నేతలు మాట్లాడడం బాగానే ఉన్నప్పటికీ ఇండియా కూటమిలోని నేతలు ఆయనకు మద్దతు ఇవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న మమతా బెనర్జీ చంద్రబాబుకు మద్దతు తెలపడం కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది. బిజెపితో జనసేనతో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు ఇండియా కూటమి నుంచి అనూహ్యంగా మద్దతు రావడం బిజెపి నేతలకు కచ్చితంగా ఇబ్బంది పెట్టే చర్య. ఇప్పటికే పలుమార్లు వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని వెళ్లడం ద్వారా మాత్రమే జగన్ అధికారం నుంచి దింపాలని భావిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కూడా ఇది మింగుడు పడని అంశం. బిజెపితో తెగ తెంపులు చేసుకొని తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తారా లేదా కేవలం బిజెపితో ఎన్నికలకు వెళ్తారా అనేది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సిన సమయం వచ్చినట్లు కనిపిస్తోంది.
మొదటినుంచి బిజెపి చంద్రబాబును నమ్మదగిన వ్యక్తి కాదు అని చెబుతూనే ఉంది. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో బిజెపితో తగదెంపులు చేసుకుని కాంగ్రెస్ కూటంకి చంద్రబాబు ఆర్థిక వనరులు సమకూర్చారు అని బిజెపి వద్ద రిపోర్టులు ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ప్రతిసారి బిజెపి నేతలు కలిసినప్పుడు చంద్రబాబుతో పొత్తు వల్ల భవిష్యత్తులో నష్టం వస్తుందని కచ్చితంగా చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు అని బిజెపి నేతలు చెబుతూనే ఉన్నారు. ఆయనతో వచ్చే ఎన్నికల్లో వెళ్లడం వల్ల తెలుగుదేశం పార్టీకి మళ్లీ జీవం పోసినట్లు అవుతుందని బిజెపి నేతలు బలంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో జగన్కు వెనకనుంచి సంపూర్ణ మద్దతు ఇస్తూ చంద్రబాబు మీద కసి తీర్చుకుంటున్న సమయంలో ఇప్పుడు చంద్రబాబుకు అనూహ్యంగా ఇండియా కూటమి నుంచి మద్దతు లభిస్తుంది. ఇది కచ్చితంగా చంద్రబాబుకు ఊరట చెందే అంశం అయినప్పటికీ బీజేపీతో వెళ్లాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు కలుపుకొని వెళ్లడం కుదురుతుందా లేదా అనేది అర్ధం కావడం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ బిజెపితో తెగ తెంపులు చేసుకొని తెలుగుదేశం పార్టీతో కలిసి నడిస్తే కేంద్ర పెద్దల వద్ద ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇటీవల ఎన్డీఏ పక్షంలో చేరిన జనసేన మళ్లీ ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకుంటే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళ్తాయి అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.