fbpx

కన్ఫ్యూజన్లో జనసేన…

Share the content

జనసేన పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొన్ని నియోజకవర్గంలోని ఇన్చార్జిలను నియమించకపోవడం జన సైనికుల్లో జనసేన కోసం పనిచేసే నాయకుల్లో కన్ఫ్యూజన్ మొదలైనట్టు కనిపిస్తోంది. టిడిపి, బిజెపితో పొత్తుల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించలేదు. జనసేన కంచుకోటగా ఉన్న రాజోలు నియోజకవర్గంలో ఇంచార్జ్కం ని నియమించలేదు. 2019 ఎన్నికల్లో ఒక సీటును నెగ్గించుకున్న నియోజకవర్గ రాజోలు.

ఈ నియోజకవర్గంలో జనసేన కేడర్ బలంగా ఉంది. అయితే ఇన్చార్జి లేకపోవడంతో జనసైనికులు కన్ఫ్యూజన్లో పడ్డారు. గత ఎన్నికల్లో రాజుల నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుకూలంగామారారు. తర్వాత ఆ ప్రాంతంలోని ఇన్చార్జినునియమించలేదు. జనసేన కాదని ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్లిపోయిన ఇక్కడ కేడర్ మాత్రం బలంగా ఉంది. 2021 లో రాజోలు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన హవా చాటింది. 15 సర్పంచ్ స్థానాలను జనసేన వంటి చేత్తో గెలిచింది. ఇదే క్రమంలో జూన్ నెలలో అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నుండే రాజకీయం మొదలు పెడదామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కూడా రాజోలు నుండే ప్రారంభమవుతుందని జన సైనికుల్లో జోష్ నింపారు. తరువాత ఈ నియోజకవర్గంలో గట్టిగా పని చేసే నాయకులు, టికెట్ ఆశించే వర్గాలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జును ప్రకటిస్తే క్యాడర్లో విభేదాలు చెలరేగి విడిపోయి జనసేనకు మొత్తానికి చేటు వచ్చే పరిస్థితి ఉంటుందనే ఆలోచనలోనే ఇంకా ఇంచార్జ్ ను నియమించలేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. తర్వాత కొన్ని నియోజకవర్గాలు ఇన్చార్జిలను అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే రాజోలు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పక్కన నియోజకవర్గం నేతలు కూడా ఆసక్తి చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన రాజోలు టికెట్ కోసం నలుగురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ ఆవిర్భావ నుండి పార్టీ కోసం పనిచేస్తున్న ఏడ్డే మహాలక్ష్మి ప్రసాద్, డాక్టర్ రాపాక రమేష్ బాబు, ఇటీవల వైసిపి నుండి జనసేనలోకి వచ్చిన బొంతు రాజేశ్వరరావు, కాగా మరోపక్క జనవాణి కార్యక్రమం కన్వీనర్ గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ కూడా ఇక్కడ నుండే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం. అయితే వీరెవరు కాకుండా మరొక బలమైన అభ్యర్థిని జనసేన రాజులు నియోజకవర్గ బరిలో దింపేందుకు కసరత్తులు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గ ఇన్చార్జిని నియమించకపోవడం పార్టీ క్యాడర్ను దెబ్బతీసే విధంగా ఉంటుందని పార్టీ విశ్లేషకులు పవన్ కు సూచనలు చేస్తున్నారట. రాజోలు నుండి ఎవరిని బరిలో దింపిన అత్యధిక మెజార్టీతో గెలుపు సాధ్యం అనే ధీమాలో జనసేన ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *