fbpx

లక్ష్మి పార్వతి చెప్పే దానిలో నిజమేంత??

Share the content

ఎన్టీఆర్ నాణెం వివాదం ఇప్పుడు సరికొత్త వివాదాన్ని రాజేసేలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ భార్యగా తనను కార్యక్రమానికి పిలవలేదని ఇది కచ్చితంగా ప్రోటోకాల్ నిబంధనలను తప్పడమేనంటూ లక్ష్మీపార్వతి ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఏకంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి లకు లేఖలు రాయడంతో పాటు న్యాయంగా కూడా పోరాడుతానని ఆమె చెబుతున్నారు. న్యాయపరంగా భార్య గా దక్కాల్సిన గౌరవం తనకు దక్కడం లేదంటూ దానికి కచ్చితంగా నారా నందమూరి కుటుంబాలే కారణమంటూ ఆమె తన కోపాన్ని మీడియా ముందు ప్రదర్శించారు. సాక్షాత్తు భారత ప్రభుత్వమే నాణెం విడుదల సంబంధించి ప్రోటోకాల్ లో ఉన్న అందరికీ సమాచారం అందించింది. ఏకంగా రాష్ట్రపతి భవన్ ఈ సమాచారాన్ని పంపినప్పటికీ ఇప్పుడు ప్రోటోకాల్ వివాదం రావడం, అది రాజకీయంగా కూడా కొత్త వివాదం సృష్టించేలా ఉండడం ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారుతోంది. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతికి గుర్తింపు ఉందా అసలు లేదా అనే అంశం ఇప్పుడు ఇటు న్యాయ పరంగా గాని అటు రాజకీయపరంగా గాని చర్చకు రావలసిన అంశంగా మాత్రం కనిపిస్తోంది.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడానికి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ వద్దకు చేరారు అన్నది వాస్తవం. అప్పటికే ఆమెకి వీరగంధం సుబ్బారావు తో వివాహం అయింది. భర్త అనుమతి తీసుకొని ఆమె ఎన్టీఆర్ వద్ద జీవిత చరిత్ర రాయడానికి ఉండిపోయారు. వారిద్దరి మధ్య ఉన్న సాహిత్యం తర్వాత మరింత దృఢం అయింది. ఏకంగా ఎన్టీఆర్ ను ప్రభావితం చేసే దిశగా లక్ష్మీపార్వతి అన్నింట్లో వేలు పెట్టే దిశగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఫలితం గానే చంద్రబాబు గ్రూపులు కట్టడం, దానికి ఈనాడు రామోజీరావు మద్దతు పలకడం వంటివి జరిగాయి. వైస్రాయ్ ఘటన జరగడానికి కూడా వెనక ఉన్న అసలైన కీలక భూమిక లక్ష్మీపార్వతి అన్నది నందమూరి కుటుంబం కూడా బలంగా నమ్ముతుంది. చివరి దశలో ఎన్టీఆర్ పూర్తిగా లక్ష్మీపార్వతి ఆడించినట్లుగానే ఆడారు అన్నది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చెప్పే మాట. ఎన్టీఆర్ ను కేవలం బొమ్మగా చేసి వెనుక నుంచి అన్నీ తానై పెత్తనం చేయడంతోనే లక్ష్మీపార్వతి వైఖరి మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో సైతం అసహనం పెరిగి చంద్రబాబు చెప్పినట్లుగా వారు తిరుగుబావుట ఎగురవేశారు అన్నది జగమెరిగిన సత్యం. అయితే దీనికి రకరకాల మాటలు రకరకాల విమర్శలు ఇంకా రకరకాల ఆరోపణలు రావడం మాములే అయినా, తెలుగుదేశం పార్టీని స్థాపించి అద్భుతమైన విజయాలు సాధించిన ఎన్టీఆర్ను అంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు నమ్మకపోవడం వెనుక చంద్రబాబు వెంట నడవడం వెనుక కచ్చితంగా లక్ష్మీపార్వతి ప్రభావం ఉంది అనేది మాత్రం కాదు అనలేని సత్యం. ఎన్టీఆర్ అసలు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారా లేదా అంటే దానికి బలమైన సాక్షాధారాలు ఏవి లేవు. కేవలం కొన్ని సభల్లో ఆమెను పరిచయం చేయడం అలాగే ఆమె కూడా ఎన్టీఆర్ భర్తగా మౌఖికంగా ఆమోదం పొందడం వరకు మాత్రమే తెలుసు. లక్ష్మీపార్వతి కి ఎన్టీ రామారావు కు ఎక్కడ పెళ్లయింది వారి పెళ్లి రిజిస్ట్రేషన్ అయిందా లేదా దానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది ఇప్పటికీ బయటపడని అంశం. ఎన్టీ రామారావును పెళ్లి చేసుకున్నట్లు అయితే లక్ష్మీపార్వతి దానికి ముందుగానే భర్త వీరగంధం సుబ్బారావు కు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వాల్సి ఉంది. విడాకుల పత్రం ఎప్పుడు మంజూర అయింది అసలు వీర గంధం సుబ్బారావుకు విడాకులు ఇచ్చారా ఇవ్వలేదా అన్నదానికి లక్ష్మీపార్వతి వద్ద సమాధానం లేదు. ఒకవేళ వీరగంధం సుబ్బారావుకు విడాకులు ఇవ్వకుండానే ఎన్టీ రామారావును పెళ్లి చేసుకున్నట్లయితే చట్టబద్ధంగా లక్ష్మీపార్వతి నేరం చేసినట్లే అవుతారు. ఈ ప్రశ్నలు దేనికి సమాధానం లేకుండా చెప్పకుండా లక్ష్మి పార్వతి వితండవాదనగా తనను పిలవలేదు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ నడుచుకోలేదు అంటే ఆమె వాదనలో ఏమాత్రం పసలేనిది అవుతుంది. ఆమె ఇప్పటికే చాలామంది వద్ద చులకన అయిపోయారు. ఎన్టీ రామారావును భర్తగా లక్ష్మీపార్వతి చెప్పుకోవడం తప్పితే నందమూరి నారా కుటుంబం నుంచి మాత్రం ఎప్పుడు ఆమెకు మద్దతు గానీ ఆమె మాటను అంగీకరించింది కానీ లేదు. ఎన్నిసార్లు ఎన్టీ రామారావు నా భర్త అని చెప్పిన చట్ట ప్రకారం పెళ్లి జరగకపోతే అది పెళ్లి కానట్లే లెక్క. లక్ష్మీపార్వతి దీనిని తెలుసుకొని, న్యాయపరంగా తన వద్ద ఉన్న సాక్షాధారాలను కోర్టులో నిరూపించుకుంటేనే బాగుంటుంది. కోర్టు నుంచి ఆమోదపత్రం లభిస్తే ఖచ్చితంగా లక్ష్మీపార్వతి వాదనకు బలం చేకూరుతుంది. ఈ దిశగా ఆమె ప్రయత్నించిన తర్వాతే మిగిలిన అన్ని విషయాలు మాట్లాడితే మంచిది. లేకుంటే జనంలో ఆమె మరింత చులకన అవడం ఖాయం. ఇంతకు అసలు లక్ష్మి పార్వతి మొదటి భర్తగా చెబుతున్న వీరగంధం సుబ్బారావు తర్వాత ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు అసలు ఉన్నాడా లేదా అన్నది కూడా ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న… దీనికి కచ్చితంగా లక్ష్మీపార్వతి సమాధానం చెప్పాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *