fbpx

తమ్ముళ్లు అతి అంచనాలు వద్దు

Share the content

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని జనసేన పార్టీతో కలవడం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని ఓ వర్గం వాదన. ప్రస్తుత పరిస్థితులను చూస్తే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది అన్నది ఆ వర్గం చెబుతున్న మాట. అయితే తెలుగుదేశం పార్టీ మీద పూర్తిస్థాయి అభిమానంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని బలంగా కోరుకుంటున్న వర్గంతో ఇదే వాదన బయటకు వస్తోంది.. అయితే రాజకీయం కాస్త తెలిసిన వారు, రాజకీయాలు ఎలా ప్రభావితం అవుతాయి అని అర్థం చేసుకున్నవారు మాత్రం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో వెళ్తేనే మంచిది అని బలంగా చెబుతున్నారు. బిజెపితో జత కట్టిన కట్టకపోయినా పెద్ద లాభం ఉండదని జనసేన పార్టీని మాత్రం కలుపుకుపోవాలని చంద్రబాబుకు హితబోధ చేస్తున్నారు. దీంతోపాటు కచ్చితంగా చంద్రబాబు కూడా పొత్తుల మీద కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం దగ్గర పడుతుంది. దీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులు, సీట్ల పంపకం అనేది చాలా కీలకంగా మారనుంది.

ఎన్నికల్లో పొత్తుల వల్ల కనీసం ఎన్ని ఓట్లను ప్రభావితం చేసినట్లే. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తుంది. 2019 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్ల సుమారు 30 నియోజకవర్గాల్లో ఫలితం తేడా వచ్చింది. ఈసారి కచ్చితంగా జనసేన పార్టీ బలం పెరిగిందని ఇంటిలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత కచ్చితంగా కనిపిస్తోంది. వీటిని లెక్క వేసుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావితం చేసే ఓట్లను సంపాదించగలదు. తెలుగుదేశం పార్టీ దీనిని గుర్తిస్తే, కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా బలంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే కచ్చితంగా అభ్యర్థులు గెలుపు చాలా సులభం అవుతుంది. దీనికి ఎలాంటి అరమరికలు అలాగే వెన్నుపోట్లు లేకుండా రాజకీయం చేస్తేనే ఎన్నికల్లో బలమైన వైసీపీని ఢీకొట్టడం సాధ్యం. రెండు పార్టీలు తమ బలాబలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సీట్లను పంచుకోవడం ద్వారా మాత్రమే, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా పని చేసుకోవడం వల్ల మాత్రమే అధికారానికి దగ్గర అవుతారు. దీనిని రెండు పార్టీలు గుర్తిస్తేనే మేలు. తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు చెబుతున్నట్లు ఒంటరిగా వెళ్తే తెలుగుదేశం పార్టీ ఉనికికే వచ్చే ఎన్నికల్లో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అటూ ఇటూ అయితే వచ్చే తరం ప్రతినిధిగా లోకేష్ ను నాయకులు ఒప్పుకుంటారా లేదా అన్నది కూడా అనుమానమే. అలాగే చంద్రబాబుకు వయసు మీరుతున్న దృష్ట్యా ఆయనను రాష్ట్ర ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. దీంతో పార్టీ చేతులు మారుతుంది అన్న అనుమానం కూడా ఎప్పటినుంచో నెలకొంది. ఎన్నికల్లో కనుక కచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక పార్టీ నిర్వాహణలోనూ, సంస్థగతంగాను లోకేష్ బలోపేతం అవుతారు. దీని ద్వారా ఆయన కొత్త అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది. ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ చక్క పెట్టుకోగలరు. ఏమాత్రం తేడా చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం అని గుర్తుంచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *