fbpx

ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం వరాల జల్లు

Share the content

సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు విజయవాడలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నిర్వహించిన 21వ రాష్ట్ర మహాసభలో సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే 1.35లక్షల నూతన ఉద్యోగాల భర్తీతో పని భారం తగ్గించామని వివరించారు. తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. అధికారంలో ఉన్నరోజుల్లో చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలలు ముందు మాత్రమే జీతాలు పెంచగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఉద్యోగులకు పెంచిన జీతాలు చెల్లిస్తోందని వివరించారు. ఉద్యోగుల జీతాల ఖర్చు గతంలో 1,100 కోట్లు ఉండగా నేడు 3,300 కోట్లకు చేరిందన అయినా ఉద్యోగుల కోసం చిరునవ్వుతో భరిస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగుల కల్పన, గ్రామ స్వరాజ్య సాధనలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని తమ ప్రభుత్వం సక్సెస్ కు కారణం ఉద్యోగులే అంటూ సీఎం జగన్ ఉద్యోగులపై పొగడ్తల వర్షం కురిపించారు. రిటైర్మెంట్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి సమస్యలు పడకుండా వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్ కు పంపించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఫంక్షన్స్ కి రాబోయే రోజుల్లో దేశమే మన రాష్ట్రానికి వచ్చి కాపీ కొట్టి అమలు చేస్తుందని అన్నారు.

పెండింగ్ డిఏలు త్వరలోనే చెల్లింపు

రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వ ఉద్యోగులపై గత ప్రభుత్వం కపట ప్రేమ నటించడం తప్ప చేసింది ఏమీ లేదని జగన్ తెలిపారు. ప్రతిపక్షాలు చేసే రాజకీయ విమర్శలు, రెచ్చ కొట్టే మాటలను, కట్టు కథలను నమ్మవద్దు అని సీఎం జగన్ఉద్యోగులను కోరారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టి భౌతిక దాడులు జరుపుతున్నారని, 47 మంది పోలీసులపై పొంగనూరులో దాడి చేశారన్న విషయాన్ని సీఎం జగన్ సభ ముఖంగా గుర్తు చేశారు. ఉద్యోగులకు మంచి చేసే విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడ వెనక్కు తగ్గే పరిస్థితి లేదని సీఎం జగన్మోహన్ ఉద్ఘటించారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు డిఏలు, 2022 జూలై ఒకటికి సంబంధించిన ఒక డిఎ దసరా పండుగ నాడు అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ సీఎం ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *