fbpx

మళ్ళీ వారాహి గర్జన

Share the content

జనసేన పార్టీ మూడో విడత వారాహి యాత్ర విశాఖపట్నంలో ఖరారు అయింది. గోదావరి జిల్లాలో పూర్తి నియోజకవర్గాలు తిరిగిన తర్వాతే ఇతర జిల్లాలకు వెళ్తారు అనుకున్న తరుణంలో ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద బలమైన ముద్ర వేయాలంటే వారాహి యాత్ర ద్వారా అక్కడ ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకొని ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తుండడంతో మూడో విడత ద్వారా విశాఖపట్నం వేదికగా మొదలుకానుంది. మొదట రాజమండ్రి నుంచి మూడో విడత యాత్ర ప్రారంభం అవుతుంది అని భావించిన తరుణంలో పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించి ఉత్తరాంధ్రలో బలం పెంచుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర మీదే ప్రధానంగా దృష్టి పెట్టిన జనసేన అధినేత ఇప్పుడు వరాహ యాత్రను మూడో విడతలో అక్కడ ప్రారంభించడం ద్వారా ఉత్తరాంధ్రకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.

కచ్చితంగా గెలవాలని

పవన్ కళ్యాణ్ మొదట గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరందరికీ ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. విశాఖపట్నంలో జనావాణి కార్యక్రమం నిలిపివేసిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. యువశక్తి సభకు సైతం ఉత్తరాంధ్రను వేదిక చేశారు. ప్రతిసారి ఉత్తరాంధ్ర నాయకులతో మమేకం కావడంతోపాటు ఉత్తరాంధ్రకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నానని పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నారు. దీంతో మూడో విడత యాత్ర పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి పూర్తిస్థాయిలో కీలకమైన నియోజకవర్గాలను చుట్టి వస్తారని తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాత దాదాపుగా యాత్ర మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే కొన్ని షూటింగ్ పనులు కూడా ఉండడంతో ఆగస్టు రెండో వారంలోని యాత్ర మొదలుపెట్టి ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలి అని వేరే ప్లాన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఉస్తాద్ సినిమాను నిర్మాతలు సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన టాకీ పార్ట్ ను వేగంగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. దీంతో భారతీయ యాత్ర మూడో విడత తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్ కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *