fbpx

ఎర్ర జెండా ఎటూ తేల్చుకోలేకపోతోంది

Share the content

సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వామపక్షాల పాత్ర చాలా కీలకంగా ఉండేది. 1990 దశకాల్లో కీలక పాత్ర పోషించి, ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోను ఏదో ఒక పక్షం వహించి భారీగా సీట్లు తీసుకునే వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా బలహీనపడ్డాయి. ఒకానొక సందర్భంలో సుమారు 30 సీట్లకు పైగా ఆశించే స్థాయికి ఎరిగిన వామపక్షాలు క్రమక్రమంగా రెండు మూడు సీట్లు తీసుకునే స్థాయికి వచ్చేసాయి. వచ్చే ఎన్నికల్లో ఇప్పటివరకు ఏ పార్టీ తరఫున తాము ముందుకు వెళ్లాలి అనేది వాము పక్షాలు ఇప్పటికీ ఆలోచించలేదు. టిడిపితో కలిసి ముందుకు వెళ్దామని సిపిఐ సిపిఎం రెండు భావిస్తున్నప్పటికీ టిడిపి జనసేనతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తోంది. జనసేన బిజెపితో పొత్తులో ఉండడంతో వాము పక్షాలు ఈ కూటమిలో కలిసే అవకాశం ఉందా లేదా అని మదన పడుతున్నాయి. సిద్ధాంతపరంగా ఎప్పుడు బిజెపికి దూరంగా ఉండే వామపక్షాలు ఒకవేళ టీడీపీతో జత కలిస్తే అది బిజెపితో ప్రత్యక్షంగా పొత్తులో వెళ్తుందనీ బలంగా అనుకుంటున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనే అంశం ఇప్పటికీ వారికి స్పష్టత రాలేదు.

అక్కడ విఫలం ఐతే

తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు బిజెపితో సహా ఉంటే కనుక వామపక్షాలు పూర్తిగా ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా సాధారణంగా అక్కడక్కడ తమ అభ్యర్థులను నిలిపి ఉనికి నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఒకవేళ టిడిపి జనసేన బిజెపి పొత్తు కనక కన్ఫామ్ కాకపోతే కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో వామ పక్షాలు పొత్తు పెట్టుకుంటాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్లను బట్టి కచ్చితంగా అక్కడే సర్దుబాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు కొని స్థానాలు అయినా పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ టిడిపి జనసేన బిజెపి పొత్తు కనుక ఖరారు అయితే వామపక్షాలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపిన పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. దీంతో ఎప్పటికీ వామపక్ష నాయకులు జనసేన బిజెపితో పొత్తు కొనసాగకూడదని టిడిపి తో కలిసి జనసేన వెళ్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వామపక్షాలు ఎటువైపు వెళ్తాయి అన్నది టిడిపి జనసేన పొత్తు ఆధారంగానే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *