fbpx

బాలయ్యకు చెక్ పెడుతున్న జగన్

Share the content

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం లో అధికార వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జులని ఫిక్స్ చేసే పనిలో పడ్డారు జగన్ .టీడీపీ అనుకూల నియోజా వర్గాల పైన ప్రేత్యేక ఫోకస్ పెట్టారు . టీడీపీ అనుకూల నియోజకవర్గాలలో తమ పార్టీ నుంచే నిలబెట్టే భలమైన అభ్యర్థుల కోసం కసరత్తులు ప్రారంభించారు. ముఖ్యంగా టీడీపీ కంచుకోట హిందూపురం నియోజకవర్గం పైన ఫ్యామిలీ సెంటిమెంట్ వాడబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . బాలయ్య బాబుకి చెక్ పెట్టేందుకు ఇక్కడినుంచి ఆ కుటుంభంలో వ్యక్తిని బరిలోకి దింపనున్నాను అనే వార్తలు వినిపిస్తున్నాయి .

బాలయ్య బాబు పైన పోటీగ ఆమె ….

టీడీపీ కంచుకోటగా చెప్పుకునే నియోజకవర్గాలలో హిందూపురం ఒకటి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడా ఇక్కడినుంచి పోటీ చేసే సీఎం అయ్యారు తరువాత అయన సెంటిమెంట్ తో తనయుడు బాలకృష్ణ ఇక్కడి నుంచే రెండు సార్లు పోటీ చేసి గెలిచారు . ప్రస్తుత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బాలయ్య బాబుకి వ్యతిరేకంగా వైసీపీ నుంచి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతిని బరిలో దించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ సెంటిమెంట్ ను క్యాష్ చేస్తోవాలి అంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతిని దింపాలని దానికి సంభందించిన గ్రౌండింగ్ పనులు కూడా మొదలు పెట్టారు అంట . ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచాడని బాబు పైన నిప్పులు చెరిగే లక్ష్మి పార్వతి బాలయ్యబాబుపైన మాత్రం పదే పదే జాలి మాలు మాట్లాడే వారు . చంద్రబాబు తన తండ్రిపార్టీని లాక్కొని బాలయ్యను ఒక బొమ్మని చేసి ఆడిస్తున్నాడని మండి పడేవారు . బాలయ్యబాబుమీద సాఫ్ట్ కార్నర్ చూపించే లక్ష్మి పార్వతి ఇప్పుడు బాలయ్యకు వ్యతిరేకంగా పోటీకి నిలపడతారా అనేది ప్రస్నార్ధకమే. మరోపక్క టీడీపీ శ్రేణులు మాత్రం బాలయ్య బాబు పైనే గట్టినమ్మకంతో వున్నారు.హిందూపురం నుంచి బాలయ్యకు వ్యతిరేకం గా ఎవరిని నిలపెట్టిన పెద్దగా ఫలితం ఉండదు Aఅంటున్నారు. బాలయ్యకు వ్యతిరేకంగా లక్ష్మి పార్వతి నిలబడితే ఆమె పైన పూర్తి వ్యతిరేకత వస్తుందని ఆమె అవకాశాన్ని వదులుకోవటమే మంచిదని కొందరు భావిస్తున్నారు. కింతమంది ఈ వార్తని తోసి పుచ్చుతున్నారు. లక్ష్మి పార్వతికి సీటు ఇచ్చి పోటీకి దింపే సీను లేదు అని అంటున్నారు కొంతమంది వైసీపీ శ్రేణులు. చూడాలి మరి తల్లి కొడుకుల పోటీ నిజమో కాదో తెలియాలంటే ఎన్నికలవరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *