fbpx

చంద్రబాబు నిర్ణయం పైనే పొత్తుల భవిష్యత్తు!

Share the content

కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ ఎటువైపు నిలబడుతుంది అన్నది రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం పై జరిగే చర్చిలో తెలుగుదేశం పార్టీ పాలుపంచుకుంటుందా తర్వాత జరిగే ఓటింగ్లో ఎటువైపు మొగ్గు చూపుతుంది అన్నది కీలకం కానుంది. తెలుగుదేశం పార్టీ కనుక ఎన్డీఏ వైపు మొగ్గుచూపితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అది టిడిపి జనసేన బిజెపి పొత్తుకు మొదటి మెట్టుగా భావించవచ్చు. అలాకాకుండా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గుచూపితే కనుక వచ్చే ఎన్నికల్లో టిడిపి లేకుండానే జనసేన బిజెపి పోతుతో ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎటువైపు మొగ్గు చూపుతుంది అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు సహకరిస్తే కనుక కేంద్ర పెద్దలకు సానుకూల సంకేతాలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వెళ్లినట్లే. చంద్రబాబు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు అన్ని వర్గాలను కలవర పెడుతున్న ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు ఎన్డీఏతో ఉంటుందా లేక ఇండియా కూటమిలో చేరుతుందా అన్నది కూడా ఈ అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలపైనే ఆధారపడే అవకాశం కూడా కనిపిస్తోంది.

తటస్థంగా ఉంటే..

అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశం పార్టీ తటస్థంగా ఉంటే కనుక మళ్లీ ఈ విషయంలో చిక్కుముడి అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా ఏదో ఒక కూటమి వైపు చంద్రబాబు మగ్గుచూపితే కనుక కచ్చితంగా ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ చాణిక్యం ఇప్పుడు ఎటువైపు మొగ్గు చూపుతుంది అన్నది కీలకంగా మారింది. అవిశ్వాస తీర్మానం విషయంలో ఎప్పటికీ వైసీపీ జనసేన పార్టీలు ఎన్డీఏ కి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పటికీ తన వైఖరిని ఏ మాత్రం బయట పెట్టడం లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తటస్థంగా ఉన్నప్పటికీ కేంద్ర పెద్దల నుంచి అంత సానుకూలత వచ్చే అవకాశం లేదు. కచ్చితంగా ఎండిఏ వైపు తెలుగుదేశం పార్టీ మొగ్గుచూపితేనే వచ్చే ఎన్నికల్లో పోతు పెట్టుకోవడానికి బిజెపి పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *