fbpx

సంజీవనికి సాయం కావాలి…

Share the content

సంజీవని గా వైద్య సేవలను అందుబాటులో అందించే 104,108 వాహనాల సిబ్బంది గత మూడు నెలలుగా దుర్భరస్థితిని అనుభవిస్తున్నారు. ఆకలితో అలమటిస్తూ విధులకు హాజరు అవ్వాలంటే ప్రయాణ ఖర్చులకు అప్పులు చేస్తూ అతి కష్టం మీద ప్రజలకు ప్రాణదానాన్ని ఆరోగ్యాన్ని అందిస్తున్న ఈ సిబ్బంది వారి కుటుంబాలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత జగన్ ప్రభుత్వం వీరి ఉద్యోగాల విషయంలో చేసిన హామీలను మరిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది ఫిబ్రవరి నెల నుంచి 104, 108 సిబ్బంది అయినా డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డి ఈ ఓ లు, ఈఎంటిలు జీతాలు చేతికి రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో 104 సిబ్బంది గత పది రోజులుగా శాంతియుత నిరసన కార్యక్రమాలకు దిగిన విషయం తెలిసిందే. ప్రజలు ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటే వారిని తక్షణమే నిమిషాలపై ఆసుపత్రులకు చేరుస్తూ ప్రాణదానం చేస్తున్న 108 సిబ్బంది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పేరుతో మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ అక్కడికి అక్కడే వారికి అవసరమైన ప్రధమ చికిత్స వైద్య సేవలను మందులను అందిస్తూ 104 సిబ్బంది ఎంతో విలువైన సేవలను అందిస్తున్నారు. అయితే ఈ సిబ్బంది పరిస్థితి మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వందలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

వైయస్ రాజశేఖర్ రెడ్డిలక్ష్యానికి నీళ్లు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని పేద ప్రజల కోసం సంజీవిని పేరుతో 108, 104 వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకురాగా వాటి లక్ష్యాలు ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో నీరు గారుతోంది. అత్యంత విలువైన వైద్య సేవలు అందించే సిబ్బందికి జీతాలు అందక పోయిన ప్రభుత్వం పట్టించుకోని తీరును పలువురు విమర్శిస్తున్నారు. అరబిందో కంపెనీ యాజమాన్యంలో కొనసాగుతున్న 104, 108 సేవలను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన అవసరం ఉండగా వాటిని పట్టించుకోకపోవడంతో అరబిందో కంపెనీ యాజమాన్యం సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాణదాతలుగా ఉన్న సిబ్బంది ప్రాణాలు ఆకలితో పోయే పరిస్థితి ఏర్పడుతున్న దానిపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడం చర్చనీయంగా మారుతుంది. స్థానిక మండలాల్లో కాకుండా ఇతర మండలాల్లో సిబ్బంది పని చేయాల్సి ఉండగా వారి వీధిలో నిర్వహించాల్సిన ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణ ఖర్చులు అధికమవుతున్నాయని నెలలు తరబడి జీతాలు లేని పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లాలన్న అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషనే కష్టం అవుతున్న తరుణంలో ఇలా ప్రయాణ ఖర్చులు భరించి విధులకు హాజరవ్వాలంటే అయోమయానికి గురవుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *