fbpx

రాష్ట్ర ప్రభుత్వానికి మరో బిగ్ షాక్…. సమ్మె బాటలోకి 108,104 ఉద్యోగులు.

Share the content

రాష్ట్రంలో గత 25 రోజుల నుంచి అంగన్వాడీ లు,మున్సిపల్ కార్మికులు,సమగ్ర శిక్ష అభియాన్.. వివిధ డిపార్ట్మెంట్ లు చేస్తున్న సమ్మెలు, డిమాండ్లతో తలలు పట్టుకుంటున్న వైసీపీ సర్కార్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఈ నెల 23 నుంచి 108, 104 సిబ్బంది కూడా సమ్మెకు వెళ్లనున్నట్లు సిబ్బందులు ప్రకటించారు.

అప్కాస్ లో తీసుకోవాలి:
108,104 సిబ్బంది సమ్మెకు సంబంధించి ఈ రోజు ( సోమవారం) ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. అప్కాస్‌ లో తమను తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. ఆర్థిక పరమైన అంశాలు డిమాండ్‌గా కాకుండా.. డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్లనున్నారు. 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. 108, 104ను అరబిందో సంస్థ నిర్వహిస్తున్న విషయంత తెలిసిందే. 108, 104లో 18 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళను ఆర్టీసి కాంట్రాక్టు డైవర్స్ గా తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

దేశంలో 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ అనేది ఒక ఉచిత అత్యవసర సేవ. ఇది అవసరమైన ప్రజలకు రవాణా మరియు వైద్య సంరక్షణను అందిస్తుంది. 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాల్ వచ్చినప్పుడు, దగ్గరలో అందుబాటులో ఉన్న అంబులెన్స్ కాల్ చేసిన ప్రదేశానికి పంపుతారు. అంబులెన్స్ సిబ్బందిలో డ్రైవర్, పారామెడికల్, డాక్టర్ లేదా నర్సు ఉంటారు. పారామెడికల్ ప్రాథమిక జీవిత మద్దతును అందించడానికి శిక్షణ పొందుతారు. డాక్టర్ లేదా నర్సు అధునాతన జీవిత మద్దతును అందించడానికి శిక్షణ పొందుతారు. అంబులెన్స్‌లో డీఫిబ్రిలేటర్, ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ – ఈఎంఆర్‌ఐ సహకారంతో 108 అంబులెన్స్ సేవలను తొలిసారిగా 2005 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఈ సేవలు విస్తరించాయి. జీపీఎస్ ట్రాకింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, మొబైల్ మెడికల్ యూనిట్లు లాంటి ఆవిష్కరణలను చేర్చడానికి ఈ సేవ కాలక్రమేణా అభివృద్ధి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *